స్టాక్‌ హోం: వైద్య రంగంలో విశేష కృషి చేసిన ముగ్గురు పరిశోధకులకు నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన విలియం కైలిన్‌, గ్రెగ్, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాడ్ క్లిప్‌లు నోబెల్‌ను పంచుకోనున్నారు. శరీరంలోని కణాలు ఎలా స్పందిస్తాయి? ప్రాణవాయువు లభ్యతను బట్టి స్పందిస్తాయా అనే దానిపై నోబెల్ ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది. ఈ ముగ్గురి పరిశోధనలు కేన్సర్‌, అనీమియాతో పాటు ఇతర వ్యాధులపై పోరాడేందుకు ఉపయోగపడతాయన్నారు. 2019కి సంయుక్తంగా వీరికి పురుష్కారాన్ని అందజేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్