రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌ పీఎస్ పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్‌ సర్వీస్ రోడ్డు దగ్గర కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. మోటర్ సైకిల్‌ను కారు ఢీ కొట్టింది. బైక్ పై పయనిస్తున్న భార్య, భర్తలు మృతి చెందారు. బాలిక గాయపడింది. పాపను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుప్తోంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మోటర్ సైకిల్‌ను ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి కారు దూసుకెళ్లింది. మృతులది మహబూబ్ నగర్ జిల్లాగా గుర్తించారు. భార్య, కూతురితో బైక్‌ మీద వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మారుతీ బేజ్జూ ఢీ కొట్టింది.

 

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్