ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

By సుభాష్  Published on  18 Jan 2020 3:34 AM GMT
ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 24వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌,కల్యాణ్‌ రామ్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. వర్థంతి సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఏపీ, తెలంగాణలో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

వర్థంతి సందర్భంగా ర్యాలీ..

ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పూర చౌరస్తా ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Next Story