ఐపీఎల్-13వ సీజన్‌కు కరోనా ఎఫెక్టు..?
By Newsmeter.Network
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ వల్ల 3వేలకు పైగా మృత్యువాత పడ్డారు. తాజాగా భారత్‌ను కూడా ఈ వైరస్ కలవరపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడ్డాయి. మార్చి 29 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం లీగ్ ప్రారంభం కానుంది. కరోనా భయంతో ఈ లీగ్ నిర్వహణపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఐపీఎల్-13వ సీజన్‌ను వాయిదా వేస్తారా..? లేక విదేశాల్లో నిర్వహిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కరోనా భయం లేదని, షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లను నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. 'ఇప్పటి వరకు ఎలాంటి ముప్పు లేదని, అయితే దానిపై కూడా దృష్టిసారిస్తామన్నారు'. ఈ విషయం పై.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా స్పందించారు. మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను యథావిధిగా జరుగుతాయని తెలిపారు. 'భారత్‌లో ఎటువంటి ఇబ్బంది లేదని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ గురించి చర్చించలేదన్నారు'. ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ మార్చి 29 నుంచి మే 24 వరకు జరగనుంది.