మన హ్యాపీడేస్ అయిపోయాయి : నితిన్, నిఖిల్

By రాణి  Published on  24 Feb 2020 7:49 AM GMT
మన హ్యాపీడేస్ అయిపోయాయి : నితిన్, నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ ఇటీవలే తమ రిలేషన్ షిప్ స్టేటస్ ల గురించి సరికొత్త అప్డేట్లు ఇచ్చారు. ఇకపై తాము సింగిల్ కాదని.. ఆల్ రెడీ ఎంగేజ్డ్.. రెడీ ఫర్ మ్యారేజ్ అని చెప్పుకొచ్చారు. అర్జున్ సురవరంతో హిట్ అందుకున్న నిఖిల్ తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఫోటోలను ఇటీవలే పోస్టు చేశాడు..! నితిన్ ఎంగేజ్మెంట్ కూడా ఈ మధ్యనే పూర్తయింది.. ఆ తర్వాత విడుదలైన 'భీష్మ' బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకుంది.

ఇక నితిన్-నిఖిల్ లు ఈ మధ్యనే కలుసుకున్నారు. ఒకరి పెళ్ళికి సంబంధించిన సమాచారం.. మరొకరితో పంచుకోగా.. అప్పుడు తెలిసిందేమిటంటే ఇద్దరి పెళ్లి ఒకటే రోజునట..! ఈ విషయాన్ని హీరో నిఖిల్ సిద్ధార్థ బయటపెట్టాడు. నితిన్, నేను ఎంగేజ్మెంట్ కు సంబంధించిన విశేషాలను ఒకరికొక్కరు చెప్పుకున్నాం. అప్పుడు తమ ఇద్దరి పెళ్లిళ్లు ఒకటే రోజున అని తెలిసింది. నితిన్ కు 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని నేను చెప్పగా.. 'మన హ్యాపీ డేస్ అయిపోయాయి' అంటూ నితిన్ జోక్ చేశాడని నిఖిల్ చెప్పుకొచ్చాడు. తామిద్దరం ఒకటే రోజే పెళ్లి చేసుకోవడం 'హ్యాపీ కో-ఇన్సిడెన్స్' అని అన్నాడు.

టాలీవుడ్ లో ఒకటే రోజే ఇద్దరు యంగ్ హీరోల పెళ్లిళ్లు జరగనుండడం విశేషం. ఇద్దరూ ఒకటే రోజే పెళ్లి చేసుకుంటూ ఉండడం కూడా ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 16 న టాలీవుడ్ అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను 'పెళ్లికొడుకుల' రూపంలో చూడనున్నారు. నితిన్ దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేయగా.. నిఖిల్ పక్కా హైదరాబాదీ స్టైల్ లో పెళ్లి చేసుకోనున్నాడు. ఇక ఇద్దరి పెళ్లిళ్లకు సంబంధించి పెళ్లి పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అభిమానులు కూడా వీరి వెడ్డింగ్ ఫోటోల కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారనుకోండి. హీరో నితిన్ తాను ఎనిమిదేళ్ల పాటూ ప్రేమించిన షాలిని రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా.. నిఖిల్ కూడా తాను ఐదేళ్లుగా ప్రేమిస్తోన్న పల్లవి వర్మతో ఏడడుగులు వేయబోతున్నాడు.

Next Story