నాపై లైంగిక దాడి జరిగింది : నిర్భయ నిందితుడు
By Newsmeter.Network Published on 28 Jan 2020 6:15 PM IST
నిర్భయ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై దాడి చేసింది మరెవరో కాదని సహ దోషి అయిన అక్షయ్ సింగ్ అని పిటిషన్ లో పేర్కొన్నాడు. జైలు అధికారులు ఇందుకు సహాకరించాడన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థాయం ప్రధాన జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
విచారణలో ముఖేష్ సింగ్ తీహార్ జైల్లో అధికారులపై ఆరోపణలు చేశాడు. అక్షయ్ సింగ్ అనే దోషి తనపై పలుమార్లు అత్యాచారానికి చేశాడని న్యాయస్థానంలో వెల్లడించాడు. రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్‌లో ఈ విషయం తెలిపానని అయినా పట్టించుకోలేదని వాపోయాడు. ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. దీనిపై తుది తీర్పును బుధవారం వెల్లడించనుంది.
ఇదిలా ఉండగా.. ఉరిశిక్ష తప్పించుకోవడానికే నిందితులు పలుమాల్లు కోర్టును ఆశ్రయిస్తున్నారని నిర్భయ తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి తీయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌తో వీరి ఉరిశిక్ష ఆలస్యమైంది. రాష్ట్రపతి, క్షమాభిక్షను తిరస్కరించడంతో వీరికి ఉరి శిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు.
2012లో వైద్య విద్యార్థిని పై నిందితులు ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారణమయ్యారు.