గోదావరి బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళితనాయకుడు హర్షకుమార్ ను కేసులతో వేధిస్తారా ? అంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్విటర్ లో ప్రశ్నించారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి బోటును తీయలేడా? చేతగాని దద్దమ్మ ప్రభుత్వమంటూ నారా లోకేష్ ట్విటర్‌లో మండిపడ్డారు. బోటు ప్రమాదం వెనుక రహస్యాన్ని జలసమాధి చేయలేరన్నారు. డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి..ఆ బోటును వదిలి పెట్టాలని ఒత్తిడి తెచ్చిన వ్యక్తి పేరు బయట పెట్టాలని ట్విటర్ లో డిమాండ్ చేశారు లోకేష్. బోటు ప్రమాదం, బోటును బయటకు తీయాలంటూ హర్షకుమార్ కోర్టుకు పోయిన సంగతి తెలిసిందే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్