స్వగృహానికి జగదీష్ మృతదేహాం
By Newsmeter.Network Published on 19 Jan 2020 12:02 PM IST
ఫిలిప్పీన్స్ లో కృష్ణా జిల్లా నందిగామకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం ఆ యువకుడి మృతదేహాం నందిగామకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ నేతాజీనగర్ చెందిన జగదీష్ 2016లో వైద్య విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ప్రస్తుతం వెటర్నరీ కోర్స్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
కాగా డిసెంబర్ 31న జగదీష్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహానాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జగదీష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఆదివారం జగదీష్ మృతదేహాం నందిగామకు చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story