నల్గొండ జిల్లాలో దారుణం..ఇద్దరు అన్నదమ్ములను నరికి చంపిన దుండగులు

By సుభాష్  Published on  3 Aug 2020 2:38 AM GMT
నల్గొండ జిల్లాలో దారుణం..ఇద్దరు అన్నదమ్ములను నరికి చంపిన దుండగులు

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు వారిని గొడ్డళ్లతో నరికి చంపారు. నల్గొండ జిల్లా అనుముల మండలం హాజరుగూడెంలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి, జానపాటి హరి ఆదివారం రాత్రి ఆరుయబట నిద్రించారు. ముగ్గురు అన్నదమ్ములు గాఢ నిద్రలో ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణ, అంజిలు అక్కడకక్కడే మృతి చెందగా, మరో సోదరుడు వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

కాగా, ఓ యువకుడి హత్య కేసులో ఈ ముగ్గురు అన్నదమ్ములు జైలుకు వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. ఏడాది కిందట వివాహేతర సంబంధం విషయంలో హాలియాకు చెందిన రేవంత్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. పాల సేకరణ కోసం హాజారిగూడెంకు వెళ్లి తిరిగి వస్తుండగా, మటువేసి చంపేశారు. అనంతరం జైలు శిక్ష అనుభవించారు. అయితే కొన్ని రోజుల కిందట జైలు నుంచి బయటకు వచ్చిన ఈ ముగ్గురు అన్నదమ్ములను చంపేందుకు రేవంత్‌ కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్‌ వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ తల్లి, మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో హాజారుగూడెంకు వెళ్లి గొడ్డళ్లతో దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story
Share it