వెటర్నరీ వైద్యురాలు హత్యకేసులో వెలుగులోకి కీలక ఆధారాలు

By Newsmeter.Network  Published on  29 Nov 2019 10:36 AM GMT
వెటర్నరీ వైద్యురాలు హత్యకేసులో వెలుగులోకి కీలక ఆధారాలు

నిన్న జరిగిన వెటర్నరీ వైద్యురాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఎట్టకేలకు ఈ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను, టోల్‌ ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరుని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లారీ నెంబర్‌ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ లారీ రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన లారీగా గుర్తించారు. నిందితులంతా మహబూబ్‌నగర్‌కు చెందినవారు గుర్తించారు. లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా తన చెల్లితో మాట్లాడిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్‌ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారని, ఆ సమయంలో వీరిద్దరి ఫోన్‌ కాల్స్‌ గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే వారి కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే వైద్యురాలు స్కూటీ పంక్చర్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల‌ స్వస్థలం నారాయణ పేట జిల్లా జక్లేర్...మక్తల్ ప్రధాన నిందుతుడు మొహమ్మద్ పాషాగా గుర్తించారు. అయితే మొహ్మద్‌ పాషా కొంతకాలంగా శ్రీనివాస్ రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. కాగా, పోలీసులు ఈ హత్యకు కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం ద్వారా వివరించనున్నట్లు తెలుస్తోంది.

మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి

వైద్యురాలు హత్యకేసుపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ కేసును తాను పర్సనల్‌గా మానిటర్‌ చేస్తున్నట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు. కేసు వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నామని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని కేటీఆర్‌ ఈ సందర్భంగా పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే 100 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు కేటీఆర్‌.

మంత్రి సబితాఇంద్రారెడ్డి పరామర్శ:

అలాగే మృతురాలు కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ప్రియాంక తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి సబితా తెలిపారు. ఇల్లు, ఉద్యోగం తప్ప తమ కుమార్తెకు మరొకటి తెలియదని విలపిస్తున్న తల్లి ఆవేదనను ఎవరూ తీర్చలేనిదన్నారు. మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

Next Story
Share it