'ములాయం సింగ్' కు తీవ్ర అనారోగ్యం

By Newsmeter.Network
Published on : 29 Dec 2019 3:50 PM IST

ములాయం సింగ్ కు తీవ్ర అనారోగ్యం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఉదర సంబంధిత వ్యాధితో కొంత కాలంగా భాదపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరోసారి అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ములాయం సింగ్ ను ముంబైలోని ఓ ఫ్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి మంచిగానే ఉందని... ఐసీయూలో ఉంచి వైద్య సహాయం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సాయంత్రం వరకు చూసి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది అని వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story