చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ
By Newsmeter.Network
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. మీ పాలనలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మాలాంటి ఎన్నో జాతులను లాఠీలతో కొట్టించింది నిజంకాదా? అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఏదైనా సమస్యపై రోడ్డు మీదకు వస్తే జైలుకే అని బెదిరించడం, రోడ్లపైకి వచ్చిన విద్యార్థులను హెచ్చరించిన సంగతి గుర్తులేదా? అని ప్రశ్నించారు.
మా కుటుంబాన్ని మీరు, మీ యువరాజా కసితీరా అవమానించి లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో బంధించారన్నారు.
బట్టలు మార్చుకోవడానికి వీలులేకుండా పోలీసులను పెట్టి నిద్రలేని రాత్రులు మిగిల్చింది మీరు కాదా? అని ముద్రగడ ప్రశ్నించారు. ఇంతటి ఘోరమైన అవమానం చేయమని ఏచట్టం చెబుతోందని ప్రశ్నించారు. ఆనాడు మీరు పోలీసులతో చేయించింది అరాచకం కాదా?.. ఈరోజు పోలీసు రాజ్యం అని బొంకుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయాల్లో వృద్ధ నారీ పతివ్రతను అని చెబుతుంటారు.. అలా చెప్పడానికి మీరు సిగ్గు పడకపోయినా వినడానికి మాకు సిగ్గుగా ఉందన్నారు.