అనంతపురంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని

By Newsmeter.Network
Published on : 11 Feb 2020 1:44 PM IST

అనంతపురంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మంగళవారం పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని సందర్శించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ధోనికి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయిలో ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడారు. పుట్టపర్తి సత్యసాయి బాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్పూర్తినిస్తాయని తెలిపారు. అనంతరం పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంను పరిశీలించారు.

 Ms Dhoni Visits Puttaparthi Prasanthi Nilayam

ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్‌ తరువాత నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు మహేంద్రుడు. ధోని ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2020లో ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున బరిలోకి దిగనున్నాడు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించినట్లు సమాచారం. రాబోయే టీ20లో ధోని స్థానం దక్కించుకుంటాడని ఇటీవల కోచ్‌ రవిశాస్త్రి చెప్పిన సంగతి తెలిసిందే.

Next Story