హే.. పానీ పూరి.. బేల్ పూరి..

By Newsmeter.Network  Published on  6 Feb 2020 6:13 AM GMT
హే.. పానీ పూరి.. బేల్ పూరి..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని.. క్రికెట్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు ఈ కూల్ కెప్టెన్‌. ప్రస్తుతం ధోని మాల్దీవుల్లో విహరిస్తున్నాడు.

మాల్దీవుల్లో ధోని చేసి పని ప్రస్తుతం నెటింట్లో వైరల్‌ అవుతోంది. సహచరులకు పానీపూరి అందించాడు. బండి వద్ద నిలబడి పానీపూరి తీసుకుని అందులో కావాల్సిన మోతాదులో బఠాణి, ఉల్లిపాయలు పెట్టాడు. చెంచాతో పానీని అందులో పోసీ వెటరన్ స్పిన్నర్‌ షియూష్‌ చావ్లా, మాజీ పేసర్‌ ఆర్పీసింగ్ కు అందించాడు. వెంటనే ఆర్పీసింగ్‌ గౌరవ భావంతో తలను కిందకు ఆడించి ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహీభామ్‌ ఇప్పుడు పానీపూరీ తినిపిస్తున్నాడు.. ఐపీఎల్ లో బౌలర్లకు అతడు సిక్సర్లు తినిపిస్తాడు అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

ప్రపంచ కప్‌ తరువాత మహీ టీమిండియా జెర్సీలో కనిపించలేదు. టీమిండియాలో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడో అని అత‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మెగాటోర్నీ అనంత‌రం గ‌త ఆరునెల‌ల్లో కొంత‌కాలం సైన్యంలో సేవ‌లందించిన ధోనీ.. త‌ర్వాత ప్రైవేటు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు. మహేంద్రుడి రిటర్‌మెంట్ పై రకరకాల వార్తలు వినిపించినా అవన్నిఊహాగానాలే అని తేలిపోయాయి. ఐపీఎల్ ఫామ్ ఆదారంగానే మహీ టీ20 ప్రపంచకప్‌ లో ఆడేది లేదని నిర్ణయించుకుంటాడని ఇటీవల టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు బీసీసీఐ క్రికెట్ స‌ల‌హా మండ‌లి (సీఏసీ)లోకి తాజాగా ఆర్పీ సింగ్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే.Next Story