మిసెస్ వరల్డ్ పోటీకి విశాఖ వనిత..

By Newsmeter.Network  Published on  27 Dec 2019 8:08 AM GMT
మిసెస్ వరల్డ్ పోటీకి విశాఖ వనిత..

మిసెస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న స్మృతీ భాటియా భారత్ తరఫున మిసెస్ వరల్డ్ పోటీలకు ఎంపికయ్యారు. గతనెలలో మిసెస్ ఇండియా టైటిల్ ని దక్కించుకున్న ఈ అందాల భామ లాస్ ఎంజిల్స్ లో జరిగే మెసెస్ వరల్డ్ 2020 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ముంబైలో పుట్టి పెరిగిన స్మృతి ప్రియాంక్ భాటియాను వివాహం చేసుకుని విశాఖలో స్థిరపడ్డారు. ప్రియాంక్ విశాఖలో మెరైన్ సర్వేయర్. స్మృతి దేశంలో పేరుమోసిన వివిధ బ్రాండ్లకు ప్రొఫెషనల్ విజవల్ మర్చెండైజర్ , ట్రైనర్ గా ఉన్నారు. మూడు నెలలక్రితం మిసెస్ ఇండియా పోటీలకు ఎంపిక అయినప్పుడు పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని శ్రమించానని స్మృతి చెబుతున్నారు.

మిసెస్ ఇండియా రీజెన్సీ ఇంటర్నేషనల్, మిసెస్ ఆంధ్ర, మిసెస్ బ్యూటీ విత్ పర్పస్, మిసెస్ టెక్ దివా, మిసెస్ ర్యాంప్ వాక్, మిసెస్ టాలెంటెడ్ లాంటి అనేక టైటిల్స్ ని సొంతం చేసుకున్న స్మృతి తప్పకుండా మిసెస్ వరల్డ్ పోటీల్లో ముందంజలో నిలుస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు. అమెరికాలో భారతీయ వనితల సత్తాని చాటేందుకు సిద్ధంగా ఉన్నాననీ, అందుకోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాననీ చెబుతోంది స్మృతి.

Next Story