చేర్యాలను రెవిన్యూ డివిజన్‌‌గా మార్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో చేర్యాలను రెవిన్యూ డివిజన్‌గా చేయాలని చేస్తున్న దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేర్యాలను రెవిన్యూ డివిజన్‌ గా చేయాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు.

చేర్యాలను డివిజన్‌ చేయడంలో కేసీఆర్‌‌కు చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. స్థానికేతరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబ్టటి చేర్యాలకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ చేర్యాల అని, చేర్యాలకు రెవిన్యూ డివిజన్‌ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా చేర్యాలను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలన్నారు. మా ఓపికను సీఎం కేసీఆర్‌ పరిక్షించవద్దని, రెవిన్యూ డివిజన్‌ను ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. జరగబోయే పరిణామాలను కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.