ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దాదాపుగా పూర్తి అయ్యింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం కన్నా మోతేరా స్టేడియం చాలా పెద్దది. తాజాగా ఈ స్టేడియం ఏరియల్‌ వ్యూని బీసీసీఐ(భారత క్రికెట్‌ కంటోల్‌ బోర్డ్) తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఒకే సారి లక్షా పదివేల మంది మ్యాచ్‌ వీక్షించవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో ప్రధాని మోడీతో కలిసి ఈ స్టేడియాన్ని విజిట్ చేస్తున్న సందర్భంగా.. దీన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతునారు. ట్రంప్ రాక నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బీసీసీఐ ఈ ఫోటోను ట్వీట్ చేయడంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దే లేదు.

కాగా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో తొలి మ్యాచ్‌ జరగనుంది. భారత్ – ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌కు ఈ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇక ఈ స్టేడియానికి ప్రత్యేకమైన వరల్డ్ క్లాస్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కేవలం అరగంటలోనే వర్షపు నీటిని బయటకు పంపే కొత్త తరహా సబ్ సర్ఫేస్ డ్రైన్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో వర్షం పడినా మ్యాచ్‌ రద్దు కాదు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.