'కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా.. మ్యారీడ్ లైఫే అయ్యయ్యోయ్యో'

By సుభాష్  Published on  19 Oct 2020 5:48 AM GMT
కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా.. మ్యారీడ్ లైఫే అయ్యయ్యోయ్యో

యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్'. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌,లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌ నిర్మాతలు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. గోపి సుందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, లిరికల్‌ సాంగ్‌ విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

‘అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగు అలరిస్తోంది. ‘కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే.. అయ్యయ్యోయ్యో..’ అని చెబుతూ ఊగిపోయాడు. అతను తన మ్యారీడ్ లైఫ్ గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడనేది తెలియాలంటే అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటల వరకు వేచి చూడమని చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తం మీద ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్.. పూర్తి టీజర్ ని చూడాలనే ఆసక్తిని కలిగిస్తోంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story