ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పి గాయాలతో బయట పడ్డారు. ఈ సంఘటన ఆలేరు లోని అతిధి గృహంలో చోటు చేసుకుంది . నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్యే, గ్రామ సర్పంచులు సమావేశం ఏర్పాటు చేసి. చెక్కులను పంపీణీ చేస్తుండగా భవనం ఫై పెచ్చులు రాలి ఎమ్మెల్యే సునీత తో పాటు మరో ఇద్దరు సర్పంచుల మీద పడటంతో గాయాలపాలయ్యారు.

వెంటనే వీరిని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిని పరీక్షించిన డాక్టర్ ఎటువంటి ప్రమాదం లేదని. స్వల్ప గాయాలు కావడం వల్ల కంగారు పడవలసిన అవసరం లేదని తెలిపారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే చేరిపోతుందని డాక్టర్లు తెలిపారు. ఎమ్మెల్యేకు ఈ విధంగా జరగడంతో చెక్కుల పంపిణి ప్రస్తుతానికి వాయిదా వేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.