వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..

అమ‌రావతి : అమరావతిలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ రాజధాని గ్రామాలైన పెనుమాక నుంచి తాడేపల్లి భారతమాత విగ్రహాం వ‌రకు భారీ ర్యాలీ చేపట్టారు ఆర్కే. ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అభివృద్ధి కావాలి.. వికేంద్రీకరణ జరగాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు.

కాగా 144 సెక్షన్ అమలులో ఉందంటూ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టును అడ్డుకున్నారు వైసీపీ నేతలు. పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్కెతో పాటు పలువురు వైసీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్