థాంక్యూ తాప్సీ.. ‘శభాష్‌ మిథు’ కు..

By Newsmeter.Network  Published on  29 Jan 2020 1:56 PM GMT
థాంక్యూ తాప్సీ.. ‘శభాష్‌ మిథు’ కు..

బయోపిక్‌ ల ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తోంది. భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ల జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్‌ లు వెండితెర పై ఘన విజయం సాధించాయి. తాజాగా భారత మహిళా దిగ్గజ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మిథు’ అనే చిత్రం తెరకెక్కుతోంది.

తెలుగ‌మ్మాయి అయిన మిథాలీ క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది. భార‌త్ క్రికెట్‌కి ఎన‌లేని సేవ‌లందించిన ఆమె జీవిత నేప‌థ్యంలో బ‌యోపిక్ రూపొందుతోంది. వయాకామ్ 18 నిర్మాణంలో రూపొందుతున్న‌ ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ న‌టిస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో తాప్సీ .. మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయింది. స్టైలిష్ షాట్ కొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది.కాగా తన జీవితాన్ని వెండితెరపై వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ అన్నారు. తన కథను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు వయాకామ్‌ 18 సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు. ‘‘నీ అభిమాన క్రికెటర్‌ ఎవరు అని తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్లను మీ అభిమాన మహిళా క్రికెటర్‌ అడగండి’’ ఈ స్టేట్‌మెంట్‌ ప్రతీ క్రికెట్‌ ప్రేమికుడిని ఒక్క క్షణం ఆలోచింపజేసింది. నిజానికి వాళ్లు ఆటను ప్రేమిస్తున్నారా లేదా ఆటగాళ్లను ప్రేమిస్తున్నారా అనే ప్రశ్నను తలెత్తించింది. మిథాలీ రాజ్‌ నువ్వు గేమ్‌ ఛేంజర్‌’ అంటూ ఆమె మాటలను ఉటంకిస్తూ తాప్సీ తన పవర్‌ఫుల్‌ లుక్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందుకు స్పందించిన మిథాలీ రాజ్‌..‘‘ థాంక్యూ తాప్సీ.. నువ్వు నా జీవితాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నావు’’ అని ట్వీట్‌ చేశారు.Next Story