ముఖ్యాంశాలు

  • రెండో రన్నరప్ గా మిస్ ఇండియా విజేత Miss World 2019 3

లండన్ : మిస్ వరల్డ్ (ప్రపంచసుందరి) -2019 కిరీటాన్ని జమైకాకు చెందిన యువతి సొంతం చేసుకుంది. శనివారం లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల్లో జమైకాకు చెందిన టోనీ – యాన్ సింగ్ అనే యువతి విజేతగా నిలిచింది. ఆమెకు 2019 మిస్ వరల్డ్ వనెస్సా పోన్సె (మెక్సికో) కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్ గా ఫ్రాన్స్ కు చెందిన ఒఫెలే మెజినో, రెండో రన్నరప్ గా భారత్ కు చెందిన సుమన్ రావు స్థానం దక్కించుకున్నారు. సుమన్ రావు జూన్ లో జరిగిన 2019 మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచారు.

Miss World 2019 2

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.