ఏపీ మంత్రి తానేటి వనిత తన సంతకాన్ని రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ చేశాడంటూ..పోలీసులను ఆశ్రయించారు. కడప జిల్లాలో అసైన్డ్ భూముని పొందేందుకు తన లెటర్ ప్యాడ్ పై రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేసి సిఫార్సు లేఖలా..దానిని జిల్లా కలెక్టర్ కు పంపినట్లుగా మంత్రి తెలిపారు. ఈ విషయంపై మంత్రి వనిత హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపీని కోరారు.

కాగా.. ఇటీవలే ఏపీ సచివాలయం వద్ద మంత్రి పేర్ని నాని మొబైల్ ను ఎవరో అపహరించినట్లు వార్తలొచ్చాయ్. మొబైల్ లొకేషన్ తెలంగాణ నల్గొండ జిల్లా వద్ద చూపించిందని సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. కానీ..ఆ తర్వాత సదరు మంత్రి గారి ఫోన్ దొరికిందో లేదో ఇంతవరకూ సమాచారం లేదు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.