ఆఖరికి మెగాస్టార్ కు కూడా ఇంటి పనుల కష్టాలు

By రాణి  Published on  16 April 2020 8:27 AM GMT
ఆఖరికి మెగాస్టార్ కు కూడా ఇంటి పనుల కష్టాలు

లాక్ డౌన్ మొదలయ్యాక భార్యా బాధితుల సంఖ్య పెరిగింది. ఇంట్లో భార్య పెట్టే టార్చర్ భరించలేకపోతున్నానంటూ ఆ మధ్య ఓ పెద్దాయన చేసినవీ వీడియో బాగా వైరల్ అయింది. ఇక టిక్ టాక్ లో కూడా లాక్ డౌన్ రోజుల్లో మాకు ఇదేం శిక్ష అంటూ భర్తలు ఇంట్లో పనులు చేస్తూ వీడియోలు పెట్టారు. ఇందుకు సెలబ్రిటీలేమీ అతీతం కాదు. ఇంట్లో భార్యలకు హెల్ప్ చేస్తున్నామని కొందరు చెప్తుంటే..మరికొందరేమో లాక్ డౌన్ లో బయటికెళ్తే పోలీసులు కొడుతున్నారని చెప్పినా కొత్తిమీర, కరివేపాకు అంటూ పెళ్లాలు బుక్ చేస్తున్నారని ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.

Also Read : టైలర్ గా లేడీ కానిస్టేబుల్..5000 మాస్కులే లక్ష్యం

కమెడియన్లు రాజేంద్రప్రసాద్, అలీ కూడా ఇంట్లో ఉన్నంతకాలమైనా మనం పనులు చేసి భార్యలకు రెస్ట్ ఇద్దామంటూ ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే బాటలో వెళ్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పనివాళ్లకు సెలవులిచ్చారో ఏమో తెలీదు గానీ..ఇంటి కాంపౌండ్ లో చిరంజీవి శానిటైజ్ చేస్తున్న వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మన ఇంటి పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలని చిరు తెలిపారు. ఇది చూసిన నెటిజన్లు మెగాస్టార్ పనితనాన్ని మెచ్చుకుంటున్నారు.Next Story
Share it