చిరు 152వ సినిమా షూటింగ్ ప్రారంభం

By రాణి  Published on  2 Jan 2020 12:12 PM GMT
చిరు 152వ సినిమా షూటింగ్ ప్రారంభం

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. గురువారం కోకాపేటలో వేసిన భారీ సెట్ లో తొలిరోజు షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. కాగా..సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్టుకు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

చిరంజీవి ఇప్పటి వరకూ కనిపించని పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు సినీ వర్గాల కథనాల ఆధారంగా తెలిసింది. ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈ చిత్రంలో త్రిష మరోసారి చిరు పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి బర్త్ డే ను పురస్కరించుకుని 2020 ఆగస్ట్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

Next Story
Share it