రిపోర్ట‌ర్‌ను తాకి చిక్కులు తెచ్చుకున్నాడు..

By Newsmeter.Network  Published on  15 Dec 2019 6:06 AM GMT
రిపోర్ట‌ర్‌ను తాకి చిక్కులు తెచ్చుకున్నాడు..

టీవీలో కనబడాలనే ఉత్సాహం చాలామందికి ఉంటుంది. అందుకోసం కొందరు మంచిపనులు చేస్తే ఇంకొందరు పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఇంకొందరు ఉంటారు వాళ్ళకు ఎదుటివాళ్ళని బాధ పెట్టడం కిక్కు ఇస్తుంది. అయితే తరువాత వాళ్ళు పోలీసుల చేతిలో అదే కిక్కు పొందుతారు అనుకోండి. జార్జియాలోని సవ్హానా ప్రాంతంలోని ఓ బ్రిడ్జి వద్ద జరుగుతున్న కార్యక్రమ విశేషాలను ఓ మహిళా జర్నలిస్టు లైవ్ లో చెబుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగా 'రన్ ర్యాలీ' ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న వారిలో చాలామంది టీవీలో కనపడాలన్న ఉత్సాహంతో ఆ రిపోర్టర్ వెనుక నుంచి 'హాయ్' చెబుతూ వెళ్లారు.

అయితే ఒక వ్యక్తి మాత్రం ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె షాక్ అయింది. అయినా సరే యధావిధిగా తన లైవ్ ను కొనసాగించింది. టోన్యా అనే మహిళ ట్వీట్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది రిపోర్టర్ అలెక్స్‌కు కూడా చేరింది. ఈ వీడియోను ఆమె రిట్వీట్ చేసింది. విధి నిర్వహణలో గానీ, మరెక్కడైనా గానీ.. మరే మహిళతో ఇలా ప్రవర్తించవద్దంటూ వార్ణింగ్ ఇచ్చింది. లైంగిక వేధిపుల కేసు పెట్టింది. నిందితుడు క్షమాపణలు చెప్పినప్పటికీ అలెక్స్ కేసును ఉపసంహరించు కోలేదు. మరోవైపు ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని మారథన్ నుంచి బహిష్కరించారు. భవిష్యత్తులో మరే మారథన్‌లో పాల్గోకుండా నిషేదం విధించారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 11 మిలియన్ల మంది పైగా చూశారు.Next Story