కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్తా సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇందులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా నటిస్తున్నారట. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నక్సలైట్‌ పాత్రలో నటిస్తుండగా, చరణ్‌ తోపాటు మహేష్‌బాబు కూడా నక్సలైట్‌ పాత్రలో కొంత సేపు కనిపించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. కొరటాల శివతో ఉన్న సాన్నిహిత్యంతో ఆ పాత్రలో నటించేందుకు మహేష్‌ బాబు ఒప్పుకున్నట్లు సమాచారం.

మెగా ఫ్యామిలీతో మహేష్‌కు మంచి సంబంధాలు

కాగా, మెగా ఫ్యామిలీతో మహేష్‌బాబుకు మంచి సత్సంబంధాలున్నాయి. రామ్‌ చరణ్‌, మహేష్‌ బాబు చాలా కాలం నుంచి మంచి మిత్రులే. కుటుంబ పరంగా వీరిద్దరు పలు ఫంక్షన్లలో కలుసుకుంటారు. మహేష్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా కుటుంబంతో ఉన్న రిలేషన్‌ కారణంగా చిరంజీవి సినిమాలో నటించేందుకు మహేష్‌ బాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌, మహేష్‌బాబులు కనిపిస్తుండటంతో అభిమానులకు పండగేనని చెప్పాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.