బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌, హత్య కేసులో సంచలన విషయాలు

By సుభాష్  Published on  23 Oct 2020 4:36 AM GMT
బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌, హత్య కేసులో సంచలన విషయాలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ బాలుడి కిడ్నాప్‌, హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టును పోలీసులు బయటపెట్టారు. మహబూబాబాద్‌ బాలుడు దీక్షిత్‌ కిడ్నాప్‌, హత్య వ్యవహారంలో అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. నిందితుడు మంద సాగర్‌కు బాలుడి బాబాయ్‌ మనోజ్‌రెడ్డికి మధ్య సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు పక్కా ప్లాన్‌ ప్రకారమే బాలుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. గతంలో డ్రైవర్‌గా పోలీసు వాహనం నడిపారు. ఈ మార్డర్‌ కేసు మిస్టరీలో సాగర్‌తోపాటు ఎంత మంది ఉన్నారన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

నిందితుడు మందసాగర్‌ ఏడాది నుంచి డింగ్‌టాక్ వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ యాప్‌ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ యాప్‌ కాల్‌ ద్వారానే దీక్షిత్‌ కిడ్నాప్‌ వ్యవహారం నడిపించాడు. అంతకు ముందు తన గర్ల్‌ ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసేందుకు యాప్‌ను సంవత్సరం నుంచి ఉపయోగిస్తున్నాడు. అదే యాప్‌ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడు మొబైల్‌ నంబర్‌ ద్వారా కాకుండా యాప్‌ ద్వారా కాల్‌ చేయడంతో బాలుడి ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులకు మూడు రోజులు సవాల్‌గా మారింది.

నిందితుడు మంద సాగర్‌తో దీక్షిత్‌ పరిచయం ఉండటం, తెలిసిన వ్యక్తి కావడంతో పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళదామని చెప్పి బాలుడిని తీసుకెళ్లినట్లు పోలీసులు వివరించారు. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే అతనితో పాటు వెళ్లిపోయాడు బాలుడు. అప్పటికే మందసాగర్‌ స్థానిక మెడికల్‌ స్టోర్‌ నుంచి రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

బాలుడికి నిద్ర మాత్రలు కలిపిన నీళ్లు తాగించి..

మార్గమధ్యలో ఒక చోట మంచినీళ్లు తాగేందుకు ఆపిన నిందితుడు మందసాగర్‌.. ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు వేసి బాబు చేత తాగించాడు. బాబు మత్తులోకి జారుకుని స్కృహ వచ్చే లోపు బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు హత్య చేసిన వెంటనే దీక్షిత్‌ బాబాయ్‌ మనోజ్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. బాలుడి తల్లిదండ్రుల రియాక్షన్‌ చూసేందుకు వెళ్లినట్లు పోలీసుల విచారణ తేలింది.

బాలుడు చనిపోయాక తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌ ద్వారా ఫోన్‌

కాగా, దీక్షిత్‌రెడ్డి చనిపోయాక వాయి్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ ద్వారా దీక్షిత్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడు తండ్రి రంజిత్‌రెడ్డి రమ్మని చెప్పి షాపులో నుంచి రంజిత్‌రెడ్డి కదలికలను నిందితుడు గమనిస్తూ వచ్చాడు. మఫ్టిలో ఉన్న పోలీసులు ఫాలో అవుతారన్న అనుమానం రావడంతో మళ్లీ యాప్‌ నుంచి రంజిత్‌రెడ్డికి ఫోన్‌ చేసి బెదిరించాడు నిందితుడు మందసాగర్‌. అయితే సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సహకారంతో నిందితుడు మందసాగర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.

Next Story