ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ లో అప్పీల్స్ అనలిస్ట్ గా పనిచేసే దుర్గా శంకర్ కు 'మాక్రో ఫోటోగ్రఫీ' అంటే అమితమైన ఇష్టం. దీంతో ఎప్పుడు వీలు దొరికినా అతడు తన కెమెరాతో అందమైన వాటన్నింటినీ బంధించాలని అనుకుంటాడు. అలా ఫొటోగ్రఫీ మీద ఉన్న మమకారం అతడి చేత అరుదైన సీతాకోక చిలుకలను తన కెమెరాలో బంధించేలా చేసింది. ఆ అరుదైన సీతాకోక చిలుకలు కేవలం ఉత్తర అమెరికాలో మాత్రమే ఉంటాయట.

Nymphalis Antiopa Eggsదుర్గా శంకర్..కూకట్ పల్లి లోని పార్క్ లో ఫోటోలను తీయడం మొదలుపెట్టాడు. అలా తీసిన ఫొటోలో అరుదైన సీతాకోక చిలుక ఫోటో తీశానని మాత్రం అతడు ఊహించలేకపోయాడు. తన రెడ్ మి కె20 ప్రో మొబైల్ కు ప్రోషూమార్ మాక్రో లెన్స్ ను ఉపయోగించి ఆ సీతాకోక చిలుకల బృందానికి సంబంధించిన ఫోటోలను తీశాడు. అవి అరుదైన సీతాకోక చిలుకలకు చెందినవని ఆ తర్వాత అతడు తెలుసుకున్నాడు. కాలిఫోర్నియా, ఆసియా లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే సీతాకోకల జాతి ఇదని 'నింఫాలిస్ యాంటియోపా' కు చెందిన గుడ్లని దుర్గా శంకర్ కు ఆ తర్వాత తెలిసొచ్చింది. కార్న్వెల్ యూనివర్శిటీకి చెందిన డేవిడ్ అనే ఎంటామోలజిస్ట్ సహాయం చేయగా వీటి గురించి తెలుసుకొన్నానని దుర్గా శంకర్ అన్నారు.Nymphalis Antiopa Butter Fly 2

ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎస్సి కంప్యూటర్స్ పట్టా పొందిన దుర్గా ప్రసాద్ కు పర్యావరణం, చిన్న చిన్న పురుగులన్నా అమితంగా ఇష్టపడతాడు. వాటిని తన కెమెరాలో బంధించడానికి ఇష్టపడతాడు. అందుకే తన ఫోన్ కు మాక్రో లెన్స్ ను తెప్పించి మరీ ఫోటోలు తీసేవాడు. నగరంలో పలు ప్రాంతాలకు తన కెమెరాను తీసుకొని వెళ్లి ఫోటోలను తీసేవాడు. అలా తన కెమెరాలో బంధించిన ఆ సీతాకోక చిలుకల్లో ఎక్కువ కాలం బ్రతికే జాతికి చెందినదిగా తెలుసుకున్నారు. దాదాపు 10 నుండి 12 నెలల పాటూ ఆ సీతాకోక చిలుకలు జీవిస్తాయట. తాను ఫోటోలు తీయడానికి మాక్రో ఫోటోగ్రఫీలో ఉపయోగించే టెక్నీక్ లను కూడా నేర్చుకున్నానని దుర్గా ప్రసాద్ తెలిపాడు.

Nymphalis Antiopa Butter Fly

మొబైల్ ఫోన్ ను ఉపయోగించి మాక్రో ఫోటోగ్రఫీ అంటే చాలా సహనంతో కూడుకున్నదని చెబుతాడు దుర్గా ప్రసాద్. రెడ్ మి ఇండియా మొబైల్స్ సంస్థకు సంబంధించి మాక్రో ఫోటోగ్రఫీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు దుర్గా ప్రసాద్. @xiaomiindia, @redmiindia లకు ఆరు నెలలుగా మాక్రో ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తాను తీసిన ఫోటోలు తెలంగాణ మినిస్టర్ కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకూ చేరాలని కోరుకుంటున్నానని అన్నాడు దుర్గా ప్రసాద్.

రాణి యార్లగడ్డ

Next Story