మళ్లీ మొదలైన 'మా' పంచాయతీ

By Newsmeter.Network  Published on  28 Jan 2020 12:39 PM GMT
మళ్లీ మొదలైన మా పంచాయతీ

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో ఉన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్‌పై వైఖరి, ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయ ధోరణిని నిరసిస్తూ, ‘మా’ లో ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఎదుర్కొంటున్న అవమానాలను ప్రస్తావిస్తూ, క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్. ‘మా’ అభివృద్ధికి న‌రేశ్ అడ్డంకి గా మారారని, నిధుల దుర్వినియోగం చేయ‌డంతో పాటు ఈసీ స‌భ్యుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని అందులో పేర్కొన్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన న‌రేశ్‌పై చర్యలు తీసుకోవాలని.. 9 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి పంపారు. ఈ లేఖలో జీవిత రాజశేఖర్‌, జయలక్ష్మి, మహ్మద్‌ అలీ, ఎంవీ బెనర్జీ, రాజారవీంద్ర, ఉత్తేజ్‌లతో పాటు మరో పదిమంది సభ్యులు సంతకాలు చేశారు.

కాగా ఇటీవల ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్.. కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Next Story