నిజామాబాద్‌, భువనగిరి జిల్లాల్లో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌లో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్నేహితులకు ఫోన్ చేసి ఈ దారుణానికి పాల్పడటంతో వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అలాగే భువనగిరి జిల్లా ఖిల్లాపై మరో ప్రేమ జంట కూడా ఆత్మహత్యాయాత్నానికి పాల్పడింది. గమనించిన కొందరు వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన స్వాతి, నవీన్‌లు నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.