సాయిపల్లవితో చైతు 'లవ్ స్టోరీ' !

By Newsmeter.Network  Published on  14 Jan 2020 12:58 PM GMT
సాయిపల్లవితో చైతు లవ్ స్టోరీ !

బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. దానికి తోడు మజిలీ, వెంకీ మామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్యను హీరోగా.. ఫిదా మూవీతో ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవిను హీరోయిన్ గా పెట్టి క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి 'లవ్ స్టోరీ' అని టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ఈ రోజు అధికారికంగా పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రకటించింది.

ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ లాస్ట్ వీక్ మొదలు అయిన సంగతి తెలిసిందే. చై అండ్ సాయి పల్లవి టైం వెస్ట్ చెయ్యకుండా చాల స్పీడ్ గా షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటివరకూ వందకు పైగా చిత్రాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో మొదటిసారి నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ సినిమాకి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

దీంతో పాటు శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా సినిమాకు పెద్ద ఎస్సెట్ అయింది. ఇప్పటికే చాల భాగం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. కథ విపరీతంగా నచ్చడంతో హీరో హీరోయిన్లిద్దరూ బల్క్ డేట్స్ కేటాయించారు. మరి శేఖర్ కమ్ముల మళ్లీ డీసెంట్ గా ఫిదా చేస్తాడేమో చూడాలి. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Next Story