ప్రపంచంలో మొట్టమొదటి లివింగ్ రోబో

By Newsmeter.Network  Published on  14 Jan 2020 1:46 PM GMT
ప్రపంచంలో మొట్టమొదటి లివింగ్ రోబో

  • కప్పల కణజాలం నుంచి లివింగ్ రోబోల తయారీ
  • శరీరంలో ప్రవేశించగానే ఎక్కడికైనా వెళ్లగల సత్తా
  • మందు అవసరమైనచోటికి చొచ్చుకెళ్లే మినీ రోబోలు
  • సహజంగానే నయమయ్యే దెబ్బలు, గాయాలు
  • పూర్తిగా యంత్రాలూ కాదు పూర్తిగా జీవులూ కాదు
  • రెండింటి మేలు కలయిక అయిన అద్భుతాలీ బోట్స్

శరీరంలో ఎక్కడ ఏ చిన్న దెబ్బ తగిలినా దానంతటదే నయం అయిపోతుంది. ఆఖరికి అవయవాలు తెగిపడినా సరే అవే మళ్లీ చాలా తేలికగా అతుక్కుంటాయి. టెర్నినేటర్ సినిమా చూసినవాళ్లెవరికైనా ఈ అనుభవం కళ్లముందు వెంటనే కదలాడుతుంది. ఆ.. అది సినిమా కాబట్టి సరిపోయింది. నిజంగా అలా సాధ్యం కాదుకదా అనుకునేవాళ్లకోసం వైద్య విజ్ఞాన రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, చేస్తున్న పరిశోధనలు త్వరలోనే దీటైన జవాబును ఇవ్వబోతున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ వెర్మోంట్ శాస్త్రవేత్తలు ఆఫ్రికా కప్పలపై ఈ రకమైన పరిశోధనలు చేసి సత్ఫలితాలను సాధించారు. గ్సీనో బోట్స్ పేరుతో స్టెమ్ సెల్స్ ని ఉపయోగించి తయారు చేసిన అత్యాంత ఆధునిక పరిజ్ఞానం కలిగిన, అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే బయో రోబోలను రూపొందించిన పరిశోధకులు వాటిని కప్పల శరీరాల్లోకి ప్రవేశపెట్టారు.Skynews African Clawed Frog 4891225

ఇంక తర్వాత జరిగిన దాని గురించి ప్రత్యేకంగా చెప్పడానికికేముంది అచ్చంగా టెర్మినేటర్ సినిమాలో చూపించనట్టుగానే కప్పల శరీరాల్లో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడికక్కడ గాయాలు, అనారోగ్యాలు పూర్తిగా నయమైపోయాయి. అద్భుతమైన రీతిలో వచ్చిన ఆ ఫలితాలను చూసి శాస్త్రవేత్తలే పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోయారంటే నమ్మి తీరాల్సిందే.

ఓ మిల్లీ మీటర్ పరిమాణంలో ఉండే ఈ ఆధునిక బయో రోబోలు మనుషుల శరీరాల్లో ఎక్కడైతే మందు అవసరం ఉంటుందో సరిగ్గా అక్కడికి వెతుక్కుంటూ ఈదుకుంటూ వెళ్లిపోగలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరిగ్గా ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్రాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ వస్తువులను అకర్షించి ఒక్క చోటికి చేర్చడానికి ఇవే రోబోలను వినియోగించి ప్రయోగాలు చేస్తున్నారు.

రోగి శరీరంలోని బయొలాజికల్ టిష్యూస్ ని ఇవి పూర్తిగా స్థాయిలో ఆరోగ్యంగా మార్చడానికి, అంతకంటే ఎక్కువగా T-800 అనే టిష్యూలు వాటంతటవే ఆరోగ్యాన్ని పుంజుకోవడానికీ ఈ కొత్త తరం బయో మినీ రోబోలు అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Skynews Xenobot Robot 4891239ఇవి పూర్తిగా మెషీన్లు కావని, అలాగే పూర్తిగా జీవంతో ఉన్న ప్రాణులూ కావనీ రెండు లక్షణాలనూ పుణికి పుచ్చుకున్న అత్యద్భుతమైన నిర్మాణాలని ప్రాజెక్ట్ కి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న కంప్యూటర్ సైంటిస్టులు చెబుతున్నారు. ఇవి కొత్తరకం లివింగ్ ప్రోగ్రామబుల్ ఆర్గానిజమ్ కిందికి వస్తాయని అంటున్నారు.

ఎన్నో రకాల మోడల్స్ ని పరిశీలించిన తర్వాతే ఇప్పుడు ఎంపిక చేసుకున్న మోడల్ ని శాస్త్రవేత్తలు అనేక రకాలైన ప్రయోగాలు చేసిన తర్వాతే ఖాయం చేశారని తెలుస్తోంది. మసాచుయేట్స్ లోని టఫ్స్ విశ్వవిద్యాలయంలో బయోలజిస్టులు పూర్తిగా వీటిన పరిశీలించిన తర్వాతే అసెంబుల్ చేశారని తెలుస్తోంది.

ఈ బోట్స్ పూర్తిగా కప్పల డి.ఎన్.ఎ ద్వారా అభివృద్ధి చేసినవనీ కానీ అదే సమయంలో ఇవసలు పూర్తిగా కప్పలు కానే కావనీ టఫ్స్ లో వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కప్పల సహజమైన రూపానికి, శారీరక నిర్మాణానికీ ఈ బోట్స్ శారీరక నిర్మాణం, రూపం, ధర్మాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని అంటున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫలితాలు ప్రచురితమవడంతో విశ్వవ్యాప్తంగా దీనిపై పూర్తి స్థాయిలో ఆసక్తి నెలకొనడం విశేషం.

Next Story