అధిక బరువును తగ్గించే ఐదు అద్భుతమైన వంటింటి వస్తువులు

By Newsmeter.Network  Published on  26 Jan 2020 9:08 AM GMT
అధిక బరువును తగ్గించే ఐదు అద్భుతమైన వంటింటి వస్తువులు

  • నిమ్మకాయ క్లీనింగ్ ఏంజెంట్, వ్యర్థాలకు వెంటనే తొలగిస్తుంది
  • తేనె మెటబాలిజాన్ని చక్కగా వృద్ధి చేస్తుంది, కొవ్వును కరిగిస్తుంది
  • దాల్చిన చెక్క కొవ్వును కరిగిస్తుంది, ఆకలిని పెంచుతుంది
  • అల్లం నేరుగా యాంటీబయెటిక్ లా పనిచేస్తుంది
  • అల్లానికి వెల్లుల్ని కలిస్తే ఫలితాలు మరింత శీఘ్రంగా వస్తాయి
  • శరీరంలోని విషపదార్థాలను బూడిద చేసే నల్లమిరియాలు
  • ఈ ఐదూ చాలు కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గించడానికి
  • క్రమం తప్పకుండా తీసుకుంటే బోలెడన్ని ఫలితాలు

అధిక బరువు ఇప్పుడు దేశంలో చాలామందిని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య. తిన్నవాళ్లు తిన్నట్టుగానే ఎప్పుడు చూసినా నోరు మరాడిస్తూ కనిపించేవాళ్లకు దేహంలో కొవ్వు నిల్వలు బాగా పేరుకోపోవడం, వాటివల్ల డయాబెటీస్ లాంటి అనారోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. వాటివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలనుంచి తప్పించుకోవాలంటే మళ్లీ చచ్చీచెడీ హాస్పిటల్స్ చుట్టూ, వెయిట్ రిడక్షన్ సెంటర్లుచుట్టూ, వ్యాయామశాలలచుట్టూ, యోగా కేంద్రాలచుట్టూ తిరగడంకూడా పరిపాటే.

ఒబెసిటీ నియంత్రణ, బరువును తగ్గించడం ఇప్పుడు దేశంలో అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. దానికోసం వివిధ రకాలైన ట్రీట్మెంట్లుకూడా పుట్టుకొచ్చాయి. కొన్ని సంప్రదాయ వైద్య విధానాలు, యోగా సంప్రదాయలకు అనుసంధానమైవి. మరికొన్ని నేరుగా వైద్య పరికరాల సాయంతో నిపుణుల పర్యవేక్షణలో శరీరంలో ఉన్న కొవ్వుని బైటికి లాగిపారేసి సన్నగా సన్నజాజి తీగలాగా శరీరాన్ని తీర్చిదిద్దేవి.

మొదటిరకంలో పెద్దగా ఇబ్బందులు ఉండే ప్రమాదాలేం ఉండకపోవచ్చు. ఈ మధ్యకాలంలో రోజూ కొబ్బరినూనెలు తాగడం, అన్నం మానేసి కూరలు మాత్రమే వండుకుని తినడం, నిమ్మకాయ, తేనె వేన్నీళ్లలో కలుపుకుని తాగడం, యోగాసనాలు వేయడం, వాకింగ్ చేయడం లాంటి అనేక విధానాలు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి.

వీటిలో కొన్ని డైటింగ్ ప్లాన్స్ సరైనవని కొందరు, కాదు కాదు వాటివల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మరికొందరు తారా స్థాయిలో అనేక మాధ్యమాలను ఊతంగా చేసుకుని వాదులాడుకోవడాన్నీ గమనిస్తూనే ఉన్నాంకదా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అలా కొత్త డైటింగ్ ప్లాన్లను వైద్యుల పర్యవేక్షణ లేకుండా అమలు చేసినవాళ్లు బరువు తగ్గినట్టే తగ్గి మళ్లీ కొద్ది రోజుల్లోనే విపరీతంగా బరువు పెరిగిపోతున్న కేసులకూ తక్కువేం లేదు.

ఇన్నీ సమస్యల నేపధ్యంలో అసలు అధికంగా ఉన్న కొవ్వును, బరువును, శరీరాన్నీ తగ్గించుకోవడానికి ఏవైనా సులభ తరుణోపాయాలున్నాయా అన్న ప్రశ్న ఇప్పుడు చాలామంది మనసుల్ని తొలుస్తోంది. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా ఫలితం కనిపించని స్థితిలో చాలామంది ప్రత్యామ్నాయ వైద్య విధానాలకోసం, సంప్రదాయ, ఆయుర్వేద వైద్య విధానాలకోసం వెతుక్కుంటున్నారు.

నిజానికి ఇది చాలా చిన్న సమస్య. భూతద్దంలో చూసుకుని, దడుచుకుని, మానసికంగా కుంగిపోకుండా ఉన్నవారికి మాత్రమే సూత్రం వర్తిస్తుంది. ఎంత ఎక్కువ తిన్నామన్నదికాదు ముఖ్యం, ఎంత తక్కువ తిన్నా శరీరానికి బాగా ఉపయోగపడేవి, శరీరాన్ని పూర్తి స్థాయిలో పోషించగలిగేవి, పూర్తిగా బలాన్ని ఇవ్వగలిగేవి, వ్యర్థాలను శరీరంలో పేరుకుపోయేలా చేయనివీ అయి ఉండాలన్నది మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది.

దీనివల్ల అధిక బరువుకు సంబంధించిన సమస్యలు, జీవన శైలికి సంబంధించిన డయాబెటీస్ లాంటి సమస్యలనుంచికూడా త్వరగా విముక్తిని (శాశ్వత విముక్తి కాదుగానీ కొంతవరకూ సరైన ఉపశమనం) పొందే అవకాశం కూడా ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేద వైద్య శాస్త్రం అనేక అద్భుతమైన దివ్య ఔషధాలను ఎన్నింటినో అందించింది. ముఖ్యంగా మన వంటింట్లోనే దొరికే అతి ముఖ్యమైన ఐదు వస్తువులు అధిక బరువువల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతోపాటుగా తిన్నది అరగక బాధపడేవాళ్ల బాధల్నికూడా సమూలంగా తొలగిస్తాయన్న సత్యాన్ని ఆయుర్వేద వైద్యులు అనుభవపూర్వకంగా నిరూపించడం విశేషం.

అదే మన సనాతన వైద్య సంప్రదాయానికి ఉన్న విశిష్టత. అదే మన ఆయుర్వేద వైద్య విధానం గొప్పదనం. నిజంగా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలవల్ల అంత పెద్ద పెద్ద ప్రయోజనాలు కలుగుతాయా అన్న అనుమానం ఉంటే ప్రాక్టికల్ గా ట్రై చేసి చూడండి. వారం రోజుల్లో, కేవలం వారం రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి. మాదీ గ్యారంటీ అంటూ మన ఆయుర్వేద వైద్య నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.

సరే ఆ ఐదు వంటింటి వస్తువులేంటి, వాటివల్ల కలిగే లాభాలేంటి అన్న విషయాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని వైద్యులు ఏ విధంగా వాడాలని చెప్పారో సరిగ్గా అదే విధంగా వాడితే మరింత త్వరగా ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీరు మాత్రమే వాటిని వాడడంకాక ఇప్పట్నుంచే పిల్లలకుకూడా వాటిని అలవాటు చేస్తే వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యేటప్పటికల్లా అసలు ఇలాంటి సమస్యలు వాళ్ల జోలికి వచ్చే అవకాశమే ఉండదని మన ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అధిక బరువును, కొవ్వునూ కరిగించడానికి, అరుగుదలను పెంచడానికీ ఉపకరించే ఐదు అద్భుతమైన వంటింటి వస్తువులు :

1. దాల్చిన చెక్క :

Lifestyle News Todayదాల్చిన చెక్కను ఆయుర్వేదంలో డిన్ ఇన్ ఫెక్టెంట్ గా, బ్యాక్టీరియాను నిరోధించే, పూర్తిగా తగ్గించే ఔషధంగా, వాపును తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తారు. బరువు తగ్గడం అనే విషయానికొస్తే ఈ అద్భుతమైన ఔషధం శరీరంలో మెటబాలిజాన్ని పెంచి, బ్లడ్ షుగర్ ని, కొలస్ట్రాల్ నీ అంటే శరీరానికి చేటుచేసే కొవ్వునూ పూర్తిగా నియంత్రిస్తుంది.

రాత్రిపూట పడుకునేముందు ఒక గిన్నెలో, లోటాలో, గ్లాసులో దేంట్లో అయినా సరే నిండా నీళ్లుపోసి, అందులో దాల్చిన చెక్కను వేసి మూతపెట్టి తెల్లారి లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగితే అనేకమైన అద్భుత ఫలితాలను అనతికాలంలోనే మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు.

మొదటి లాభం ఏంటంటే చక్కగా ఆకలేస్తుంది. రెండవ లాభం చెడు కొలస్ట్రాల్ కరిగిపోవడం మొదలవుతుంది. మూడో లాభం శరీరంలో మెటబాలిజం అంటే రక్తకణాలు చక్కగా వృద్ధిచెందుతాయి. ఈ మూడూ శరీరానికి అత్యంత ఆవశ్యకమైన అంశాలు, అవసరాలుకూడా. ఈ చిన్న చిట్కాని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అందుకే మన పూర్వీకులు దాల్చిన చెక్కను మసాలాల్లో విరివిగా వాడడాన్ని అలవాటు చేశారు మనకి.

2. అల్లం :

Lifestyle News Todayఅల్లం వంటింట్లో రోజూ కళ్లముందే కనిపిస్తుంది. కానీ ఎక్కువ మంది దాని ఉపయోగాలు తెలియక, తెలుసుకోలేక సరైన రీతిలో వాడరు. పాత కాలంలో వంటల్లో, ఉప్మాలో, ఇతరత్రా టిఫిన్లలో అల్లం ముక్కల్ని సన్నగా, చిన్నగా తరిగి వేసేవాళ్లు. దానివల్ల శరీరానికి తగినంత మోతాదులో కావాల్సిన అల్లం పూర్తిగా అందేది. కానీ ఆధునిక కాలంలో కనిపించే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సన్నటి, చిన్న అల్లం ముక్కల్ని తిన్నగా తీసి పక్కన పారేస్తున్నారు.

నిజానికి నేరుగా పచ్చి అల్లం ముక్కల్ని తినడంవల్ల శరీరానికి కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. రక్తకణాలు 20 శాతం వృద్ధి చెందడానికి అల్లం నేరుగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును పూర్తిగా కరిగించే లక్షణం దీనికుంది. ఇంకా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్ధాలను ఇది విసర్జక క్రియల ద్వారా బయటికి నెట్టేస్తుంది.

అల్లాన్ని తినడంవల్ల ఆకలి పెరుగుతుంది, జీర్ణ శక్తి వృద్ధి చెందుతుంది. మీరు తినే ప్రతి పదార్థంలోనూ తగిన మోతాదులో అల్లం ఉండేలా చూసుకోవడంవల్ల రోగ నిరోధక శక్తికూడా పెరుగుతుంది. అల్లం వెల్లుల్లి కలిపి తింటే అది మనం డాక్టర్ దగ్గరికెళ్లి బోల్డన్ని డబ్బులు పోసి కొని తెచ్చుకునే యాంటీబయెటిక్స్ కంటే చాలా మెరుగ్గా పనిచేస్తుంది. కేవలం బరువు తగ్గడం అనే లాభం మాత్రమే కాక దీనివల్ల మన శరీరానికి లెక్కలేనన్ని లాభాలున్నాయి.

3. నిమ్మకాయ:

Lifestyle News Todayనిమ్మకాయ రసానికి దేన్నైనా సరే చాలా తేలికగా శుభ్రం చేసే గుణం ఉంది. అందుకే రెస్టారెంట్లలో తిన్న తర్వాత ఓ చిన్న గిన్నెలో వేన్నీళ్లలో నిమ్మకాయ ముక్కను వేసి చేతులు కడుక్కోవడానికి ఇస్తారు. వీటినే ఫింగర్ బౌల్స్ అంటారు. ఎలాంటి కెమికల్స్ లేని చేతిని శుభ్రంగా కడుక్కోగలిగే విధానం ఇది. మరి మన చేతినే అది శుభ్రంగా, ఏమాత్రం జిడ్డు లేకుండా కడగగలిగితే పొట్టలోకి వెళ్లిన తర్వాత జీర్ణ వ్యవస్థకు ఎంత మేలు చేస్తుంది, ఏ స్థాయిలో పేగుల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా శుభ్రం చేసేస్తుంది ఒక్కసారి ఆలోచించి చూడండి.

సలాడ్లమీద నిమ్మకాయ రసాన్ని పిండుకోవడం, మంచినీళ్లలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం, తేనెతో కలిపి సేవించడం లాంటి విధానాలవల్ల చాలా త్వరగా అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి వీలవుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది త్వరగా కరిగిపోయే, కలిసి పోయే ఫైబర్ రూపంలో ఉంటుంది. దీన్ని నేరుగా తీసుకోవడంవల్ల అనేక రకాలుగా ఆరోగ్యపరమైన లాభాలున్నాయన్నది నిర్వివాదాంశం.

దీనివల్ల నేరుగా కలిగే లాభాలు ఏంటంటే, హృద్రోగాలు రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. హృద్రోగాలు ఉన్నవాళ్లకి వాటిని అదుపులో పెట్టుకోవడానికి దివ్యౌషధం ఇది. రక్తహీతన, కిడ్నీల్లో రాళ్లు, అరుగుదల సమస్యలు ఆఖరికి కేన్సర్ కి కూడా ఇది అత్యద్భుతంగా పనిచేసే ఔషధం. రెగ్యులర్ గా నిమ్మరసం ఏ రూపంలో అయినా సరే తగినంత మోతాదులో తీసుకునేవాళ్లకి అస్సలు అధిక బరువుకు సంబంధించిన సమస్యలు రానేరావు, ఒకవేళ అప్పటికే ఉన్నా దీన్ని తీసుకుంటే కచ్చితంగా పోతాయి. అనుమానమే లేదు.

4. తేనె :

Lifestyle News Todayరాత్రిపూట పడుకునేముందు తేనె తీసుకుంటే, నేరుగా నాలుగు చెంచాలు తాగడం లేదా వేన్నీళ్లలో కలుపుకుని తాగడం లేదా నిమ్మరసంలో కలుపుకుని తాగడం, మీరు ఏ విధంగా ఏ రూపంలో తీసుకున్నా సరే నిద్రపోయిన తర్వాత వెంటనే అది మీ శరీరంలోని అధిక శక్తిని, కొవ్వునూ కరిగించే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేసేస్తుంది. కొన్ని గంటల్లోపే శరీరానికి జరగాల్సిన మంచి ఆటోమేటిగ్గా జరిగి తీరుతుంది.

తేనెలో ఉండే శరీరానికి అవసరమైన హార్మోన్లు ఆకలిని బాగా పెంచుతాయి. అనవసరమైన వ్యర్థాలను పూర్తిగా కరిగించి పారేస్తాయి. పొట్టలో పేరుకు పోయిన కొవ్వును పూర్తిగా కరిగించడానికి తేనెను మించిన దివ్యౌషధం ఈ ప్రపంచంలోనే లేదన్నది అనేకమార్లు, అనేకమంది పేషెంట్ల విషయంలో రుజువైన సత్యం.

పొట్టలో పేరుకుపోయిన కొవ్వును పూర్తిగా కరిగించుకున్నవాళ్లకు హృద్రోగాలు, డయాబెటీస్, కేన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు, విష పదార్ధాలు ఎంత ఎక్కువగా పేరుకుపోతే అంత ఎక్కువగా రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యర్థాలను నివారించగల, నియంత్రియగల, పూర్తిగా రూపుమాపే శక్తి తేనెకు ఉంది.

పైగా తేనెను తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన శక్తి సరైన రూపంలో, ఆవశ్యకమైన రూపంలో అందుతుంది. తేనెవల్ల రక్తకణాలు వృద్ధి చెందుతాయి. తేనె శరీరంలోకి వెళ్లగానే నేరుగా ధాతువులకు అందే రూపంలో ఉన్న ఏకైక పదార్థం ఈ సృష్టిలో. ఈ కారణంవల్ల ఎలాంటి అదనపు శక్తి, కొవ్వు దీనివల్ల చేరవు. ఇలా వ్యర్థాలను సృష్టించకుండా నేరుగా శరీరానికి శక్తిని, పోషణనూ అందించే ఏకైక పదార్థం ఈ సృష్టిలో తేనె మాత్రమే.

5. నల్ల మిరియాలు :

Lifestyle News Todayఆయుద్వేదం చెబుతున్నదాని ప్రకారం అధిక బరువును తగ్గించుకోవడానికి అత్యంత దివ్యౌషధం నల్ల మిరియాలు. శరీరంలో ఉన్న అనేక విధాలైన అడ్డంకులను, బ్లాకేజెస్ నీ పూర్తిగా తొలగించగలిగిన అద్భుతమైన ఔషధం నల్లమిరియాలు. జీర్ణ క్రియను వృద్ధి చేస్తాయి. రక్తకణాలు వృద్ధి చెందడానికి ఉపకరిస్తాయి. రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చూడగలిగిన శక్తి వీటికుంది. పైగా శరీరంలో ఉన్న విష పదార్థాల్ని పూర్తిగా తొలగించగల శక్తి వీటికుంది.

నల్ల మిరియాలను తగిన మోతాదులో తీసుకుంటే నేరుగా అవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును అద్భుతంగా అతి తక్కువ కాలంలోనే కరిగించి పారేస్తాయి. కొవ్వు కరిగిపోతే విషపదార్థాలు తగ్గిపోతాయి. విష పదార్థాలు తగ్గిపోతే మెటబాలిజం వృద్ధిచెందుతుంది. మెటబాలిజం వృద్ధి చెందితే ఆరోగ్యం పెరుగుతుంది.

ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమైన ఆటోమేటిక్ ప్రక్రియలు. అందుకే మనకి కారం అవసరమైనచోటల్లా పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, పండు మిరపకాయల్ని వాడడానికి బదులుగా నల్ల మిరియాలను, నల్ల మిరియాల పొడినీ వాడడంవల్ల చాలా చాలా మేలు కలుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమాత్రం ఉండవు.

అధిక బరువును కరిగించుకోవడానికి లక్షల తగలేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ, ఫిట్ నెస్ సెంటర్ల చుట్టూ చక్కెర్లు కొట్టాల్సిన అవసరం లేదు. నేరుగా మన ఇంట్లోనే వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ ఐదు వస్తువులనూ, పదార్ధాలనూ వినియోగించడం నేర్చుకుంటే, కాస్త సోమరితనాన్ని పక్కన పెట్టడం నేర్చుకుంటే, మరికాస్త జిహ్వా చాపల్యాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అనతికాలంలోనే కనిపిస్తాయి. సో.. ఆల్ ద బెస్ట్.. వెంటనే మొదలుపెట్టేసేయండి..

Next Story
Share it