వామ్మో..! ఎంతటి సాహసం..

By సుభాష్  Published on  26 May 2020 9:41 AM GMT
వామ్మో..! ఎంతటి సాహసం..

వేసవికాలంలో మనుషులు తాగేందుకే నీరు కరువవుతోంది. ఇక జంతు జాతుల పరిస్థితి అయితే చాలా దయనీయం కదా. నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. వీధి కుక్కలు, కోతులు కూడా ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎవరో జాలి కలిగిన దయామయులు కనికరించి వాటి దాహాన్ని, ఆకలిని తీరుస్తున్నారు. ఇలా ఆహారం దొరకక అడవిలోనే తనువు చాలిస్తున్న జంతువులు ఇంకెన్ని ఉన్నాయో. ఇటీవలే హైదరాబాద్ నగరశివార్లలో కనిపించిన చిరుత కూడా అలా ఆహారం కోసం వచ్చిందే. లాక్ డౌన్ వల్ల కేవలం మనుషులే కాదు..జంతువులు కూడా ఆహారం దొరక్క అల్లాడుతున్నాయి.

గుంపులుగా ఉన్నచోటనో లేక..నాలుగు ఇళ్లవారు ఒకదగ్గర కలిసినప్పుడో, పొలాల్లో పనులు చేసేటప్పుడో ఇలా అనేక సందర్భాల్లో ఎవరైనా అమ్మో పాము..అంటే చాలు ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా ఎక్కడివక్కడ వదిలేసి ఆమడ దూరం పరుగు లంకించాల్సిందే. పాముల్లో కూడా చాలా రకాలుంటాయి. ఇళ్లలోకి ఎక్కువగా చొరబడే పాము త్రాచుపాము. ఒక్కసారి త్రాచు మనిషిపై పగబట్టిందంటే వారిని చంపకుండా వదలదు అని చెప్తుంటారు. అందుకే ఎవరికైనా చంపాలన్నంత కోపం వస్తే..వాడిది కోపం త్రాచు కన్నా డేంజర్ అని అంటుంటారు. మీరు కూడా చాలాసార్లు ఇలాంటి మాటలు వినే ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే..పాము మాట వినగానే భయపడిపోతాం కదా. మరి అలాంటిది అత్యంత డేంజరస్ అయిన కింగ్ కోబ్రాకు ఓ వ్యక్తి ఏకంగా స్నానం చేయించాడంటే నమ్ముతారా ? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే అలా చేశారు అని చెప్పేందుకు ప్రూఫ్ కూడా ఉంది.

కింద ఉన్న వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. వీడియోలో ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్నాడు. ఆ కోబ్రా 14 అడుగులు ఉంటుంది. ఎండ వేడికి తట్టుకోలేక అలా పంపు వద్దకు వచ్చిన కోబ్రాకు అక్కడున్నవ్యక్తి బక్కెట్ లో నీరు పట్టి తలస్నానం చేయించాడు. ఆ తర్వాత దాని తలను నిమిరాడు. అంతటి విషసర్పమైనా తన తాపాన్ని తీర్చినందుకు అతడిని ఏమీ చేయకూడదు అనుకుందో ఏమో మరి. ఈ వీడియోను సుశాంత్ నంద ఐఎఫ్ఎస్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు ఇలా రాశాడు. అతను పాములను కంట్రోల్ చేయడంలో మంచి పట్టుఉన్న వ్యక్తి కాబట్టి అలా చేశాడు. ఈ వీడియో చూశాక మీరు ఇలాంటి సాహసాలేమీ చేయకండి. అని సూచించాడు.Next Story