ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితులపై ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ జరగడం టీడీపీలో వణుకు పుట్టిస్తోంది. చంద్రబాబు నాయుడు వద్ద పిఎస్ గా పనిచేసిన పి.శ్రీనివాస్ ఇంటిలో భారీ ఎత్తున సోదాలు జరిగాయి. మాజీ మంత్రి లోకేశ్‌ సన్నిహితులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్‌, కిలారు రాజేష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. ప్రస్తుతం కిలారు రాజేష్ పేరు హాట్ టాపిక్ గా మారింది.

నారా లోకేష్ కు కిలారు రాజేష్ అత్యంత సన్నిహితుడు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ 'వార్ రూమ్స్' ను మేనేజ్ చేశాడు. 2014లో టీడీపీ విజయం సాధించడంతో కిలారు రాజేష్ పవర్ ఫుల్ వ్యక్తిగా మారిపోయాడు. నిర్వాణా కంపెనీకి పూర్తి స్థాయి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలు డైరెక్టర్లు గా ఉన్నారు. హెరిటేజ్ ఫైనాన్స్ లిమిటెడ్, అశ్వాస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్నాడు కిలారు రాజేష్. అమెరికా, పిట్స్ బర్గ్ దగ్గర ఉన్న రాబర్ట్ మోరిస్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశాడు కిలారు రాజేష్. బిజినెస్ అనలైసిస్, డెబ్ట్ సిండికేషన్, స్ట్రాటెజిక్ అక్విజేషన్ లలో పట్టు ఉన్న వ్యక్తి కావడంతో రాజేష్ కు టీడీపీలో ముఖ్యమైన పదవిని నారా లోకేష్ కట్టబెట్టారని తెలుస్తోంది. అప్పటిదాకా ఉన్న నేతలను పక్కన బెట్టి కిలారు రాజేష్ కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడంపై అప్పట్లో పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాణి యార్లగడ్డ

Next Story