కెన్యా ప్రభుత్వం జనాన్ని కొరడాలతో కొట్టిస్తోందా ? లాక్‌డౌన్‌ సమయంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ వీడియో ఏం చెబుతోంది ?

By రాణి  Published on  15 April 2020 5:51 AM GMT
కెన్యా ప్రభుత్వం జనాన్ని కొరడాలతో కొట్టిస్తోందా ? లాక్‌డౌన్‌ సమయంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ వీడియో ఏం చెబుతోంది ?

ప్రపంచమంతా లాక్‌డౌన్‌ పీరియడ్‌ నడుస్తోంది. జనం ఇళ్లనుంచి బయటకు రాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. పోలీసులు కూడా అంతే సీరియస్‌గా స్పందిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందరినీ ఆకర్షిస్తోంది.

విచిత్ర వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి కొరడాతో తనకు కనిపించిన వాళ్లనల్లా కొడుతున్నాడు. చేతిలో కొరడా పట్టుకొని వీధుల్లో తిరుగుతున్న వ్యక్తి.. పలువురికి కొరడా దెబ్బల రుచి చూపిస్తున్నాడు. దీంతో.. జనం చెల్లాచెదురుగా పారిపోతున్నారు.

Kenya Fact Check News 2

Kenya Fact Check News 3

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పాటించకుండా ఇళ్లనుంచి బయటకు వస్తున్న వాళ్లను టార్గెట్‌ చేస్తున్నాడు మాసాయి వేషధారణలో ఉన్న వ్యక్తి. అంతేకాదు.. సామాజిక దూరం పాటించని వాళ్లను వెంటపడి మరీ తరుముతున్నాడు. ఈ దృశ్యాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వీడియోను కెన్యా ప్రభుత్వం రూపొందించిందని, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వాళ్లను గుర్తించి ఇళ్లకు తరిమేలా ఈ వ్యక్తిని ఉసిగొల్పారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ వీడియోను కెన్యాలో చిత్రీకరించిన విషయం అయితే నిజం. కానీ, సీరియస్‌గా మాత్రం కాదు. ఇది నిజంగా జనాన్ని కొరడాతో కొడుతున్న వీడియో కాదు. వీడియోలో విచిత్ర వేషంతో కనిపిస్తున్న వ్యక్తి కెన్యా కమెడియన్‌. కొందరు ఆర్టిస్టులతో ఈ వీడియోను సరదాగా చిత్రీకరించారు. వీడియో యాదృచ్ఛిక షాట్ కాదని, కొన్ని క్లిప్‌లు అతికించి ఈ వీడియో రూపొందించినట్లు తెలుస్తోంది. వీడియోను నిశితంగా గమనిస్తే అది అర్థమవుతోంది. కొరడాతో ఈ వ్యక్తి కొందరిని మాత్రమే వెంటపడి తరుముతున్నాడు. కొరడా దెబ్బలు తగిలిన వాళ్లు బాధగా కాకుండా.. నవ్వుతూ పరుగులు తీస్తున్నారు.

అంతేకాదు.. వీడియో మొదటి ఐదు సెకన్లలో.. నీలిరంగు జీన్స్ మరియు వైట్ టాప్ ధరించిన అమ్మాయిని కొరడాతో తరుముతాడా వ్యక్తి. రెండో క్లిప్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ మారుతుంది. మొదటి ఫ్రేమ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ బ్లాక్‌లో ఉంటే.. రెండో ఫ్రేమ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ వైట్‌లో ఉంటుంది.

అయితే.. సరదాకే చిత్రీకరించినా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ వీడియో సోషల్‌ మీడియా ప్రియులను తెగ ఆకర్షిస్తోంది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే జనాలను ఆలోచింపజేస్తోంది.

ప్రచారం : కెన్యాలో లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వాళ్లను ప్రభుత్వం కొరడాతో కొట్టిస్తోంది.

వాస్తవం : ఇది ఓ కమెడియన్‌తో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం రూపొందించిన కామెడీ ప్రోగ్రాం. ఆర్టిస్టులతో రూపొందించిన వీడియో.

- సుజాత గోపగోని

Next Story
Share it