నేడు కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

By సుభాష్  Published on  29 Oct 2020 3:37 AM GMT
నేడు కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

ఇటీవల ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శాసన మండలిలో చైర్మన్‌ గుత్తా సురేందర్‌రెడ్డి కవితతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు.

ఈనెల 9న జరిగిన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత 728 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 29 ఓట్లు వచ్చాయి. దీంతో 672 ఓట్ల మెజార్టీతో కవిత విజయం సాధించారు.

కాగా, 2014 నుంచి 2019 వరకు లోక్‌సభ సభ్యురాలిగా కవిత నిజామాబాద్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే కవిత ఇప్పటికే ప్రయాణ స్వీకారం చేయాల్సి ఉండగా, హోం క్వారంటైన్‌లో ఉండటంతో ఆలస్యమైంది.

Next Story