కపిల్‌దేవ్‌ గుండెకు ఆపరేషన్‌

By సుభాష్  Published on  24 Oct 2020 6:31 AM GMT
కపిల్‌దేవ్‌ గుండెకు ఆపరేషన్‌

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్సత్రిలో చేరిన ఆయన కోలుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మధ్యాహ్నం కపిల్‌కు గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరగ్యం నిలకడగా ఉందని, రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా, కపిల్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్యానా హరికేన్‌ శనివారం ట్విటర్‌ ద్వారా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలావుంటే.. 1959, జనవరి 6న ఛండీగ‌డ్‌లో జన్మించిన కపిల్ దేవ్.. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి.. ప్రపంచంలోని అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకరిగా పేరు సంపాదించాడు. హర్యానా హరికేన్‌గా ప్రసిద్ది చెందిన కపిల్‌దేవ్‌ సారథ్యంలో భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారిగా కైవసం చేసుకంది. టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు చేసి, 400 వికెట్లు తీసి డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు. క‌పిల్‌ను భార‌త ప్ర‌భుత్వం 1982లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషన్ అవార్డుల‌తో స‌త్క‌రించింది.

జింబాబ్వేపై కీలక సమయంలో వీరోచిత బ్యాటింగ్‌తో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కపిల్‌దేవ్‌ తన కెరీర్‌లో 131 టెస్ట్‌ మ్యాచ్‌లు, 225 వన్డే మ్యాచ్‌లు ఆడారు. టెస్ట్‌ల్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లు తీసి రికార్డు సాధించారు. కిపిల్‌దేవ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువరు ట్వీట్లు చేస్తున్నారు.Next Story