కంగ‌నా ర‌నౌత్‌.. శ్రీదేవి కూతురికి స‌వాలా?

By సుభాష్  Published on  29 Aug 2020 4:24 AM GMT
కంగ‌నా ర‌నౌత్‌.. శ్రీదేవి కూతురికి స‌వాలా?

బాలీవుడ్లో గ‌త ద‌శాబ్ద కాలంలో న‌టిగా గొప్ప పేరు, స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ ఎవ‌రు అంటే కంగ‌నా ర‌నౌత్ అని మ‌రో మాట లేకుండా చెప్పేయొచ్చు. క్వీన్, త‌ను వెడ్స్ మ‌ను, త‌ను వెడ్స్ మ‌ను రిటర్న్స్, మ‌ణిక‌ర్ణిక లాంటి సినిమాల్లో అద్భుత‌మైన పెర్ఫామెన్స్‌తో ఆమె భారీగా అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకుంది. బ‌య‌ట వివిధ అంశాల్లో కంగ‌నా స్పందించే తీరు, ఆమె రాజేసే వివాదాల విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉన్న‌ప్ప‌టికీ.. న‌టిగా మాత్రం కంగనాను అంద‌రూ పొగిడేవాళ్లే. గ‌త ఏడాది మెంటల్ హై క్యా సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ అందులో కంగనా పెర్ఫామెన్స్ సూప‌రనే పేరే వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆమె జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవిలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆమె తేజస్ అనే కొత్త సినిమాను ప్ర‌క‌టించింది. ఇది ఇండియ‌న్ నేవీ నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. యుద్ధాల స‌మ‌యంలో నేవీ సిబ్బంది చూపే ధైర్య సాహ‌సాల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంది. కంగ‌నాది ఏదైనా నిజ జీవిత పాత్రా అన్న‌ది తెలియ‌ట్లేదు. ఐతే ఆమె ఓ సాహ‌స మ‌హిళ పాత్ర‌లో అయితే క‌నిపించ‌బోతోంద‌ని దీని ఫ‌స్ట్ లుక్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. స‌ర్వేష్ మేవారా అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నుండ‌గా.. రోనీ స్క్రూవాలా యురి త‌ర్వాత నిర్మిస్తున్న చిత్ర‌మిది.

ఐతే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ చూడ‌గానే శ్రీదేవి కూతురు జాన్వి న‌టించిన లేటెస్ట్ మూవీ గుంజ‌న్ స‌క్సేనా గుర్తుకొచ్చింది అంద‌రికీ. ఆ సినిమాకు గాను జాన్వి బాగానే ప్ర‌శంస‌లందుకుంది. ఐతే ఇలాంటి స్టార్ కిడ్స్ అంటే మంటెత్తిపోయే కంగనా.. నేవీ సాహ‌స మ‌హిళా త‌న‌దైన శైలిలో పెర్ఫామ్ చేసి శ్రీదేవి కూతురిని డామినేట్ చేసి, ఇలాంటి పాత్ర‌ల్లో ఎలా న‌టించాలో చూపించ‌డానికే ఈ సినిమా ఒప్పుకుందేమో అనిపిస్తోంది.

Next Story