జూన్‌ 21న ఏడు ప్రత్యేక రోజులు.. అవేంటో తెలుసా..?

By సుభాష్  Published on  20 Jun 2020 8:28 AM GMT
జూన్‌ 21న ఏడు ప్రత్యేక రోజులు.. అవేంటో తెలుసా..?

జూన్‌ 21.. ఆదివారం ఏడే ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఈ 21వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఒక్క రోజే ఏడు ప్రత్యేకమైన రోజులకు వేడుక కానుంది. ప్రతి అంశంపై కూడా ఇలాంటి దినోత్సవాలు జరుపుకొంటారు. కానీ ఇతర తేదీల్లో వస్తుంటాయి. ఈ ఒక్క రోజు మాత్రం ఏడు దినోత్సవాలు వచ్చాయి. ఒకే రోజు ఏడు ప్రత్యేక దినోత్సవాలు రానున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం..

ప్రపంచ యోగా దినోత్సవం

2015 భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో ఈ రోజున యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము.

ఫాదర్స్‌ డే:

నిజానికి ఫాదర్స్‌ డే ప్రతీ సంవత్సరం జూన్‌ 3న నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం మూడో ఆదివారం జూన్‌ 21న వచ్చింది. అప్పట్లో ప్రతి ఏడాది జూన్‌ మూడో ఆదివారం నిర్వహించాలని నిర్ణయించారు. కుటుంబ బాధ్యతలను మోస్తూ ముందుకు నడిపిస్తున్న తండ్రిని గౌరవించేందుకు ప్రతి యేడాది ఫాదర్స్‌ డేను నిర్వహిస్తుంటారు.

షేక్‌ హ్యాండ్‌ డే:

ప్రతి యేడాది షేక్‌ హ్యాండ్‌ డే జూన్‌ 21న నిర్వహిస్తుంటారు. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ దినం జరుపుకొనే అవకాశం లేదు. ప్రతిసారి ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నా.. కరోనా పుణ్యమా అని ఇది జరుపుకోలేకపోతున్నారు.

ప్రపంచ సంగీత దినోత్సవం

జూన్‌ 21న ప్రపంచ సంగీత దినోత్సవం (వరల్డ్‌ మ్యూజిక్‌ డే) ను నిర్వహించుకుంటారు. 1982లో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఇది మొదలైంది. ప్రస్తుతం ఈ దినోత్సవాన్ని ప్రపంచంలోని 120 దేశాలు జరుపుకొంటున్నాయి.

ప్రపంచ మానవత్వ దినోత్సవం:

జూన్‌ 21న ప్రపంచ మానవత్వ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ప్రజల్లో మానవత్వాన్ని పెంచేలా 1980లో మానవత్వ దినోత్సవం జరుపుకొంటున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మానవత్వాన్ని పెంపొందించేందుకు స్ఫూర్తిగా నిర్వహిస్తుంటారు.

జన దినోత్సవం:

జల దినోత్సవం.. సమస్త ప్రాణ కోటికి జీవనాధారం నీరు. నీరు లేకపోతే ఏ జీవి కూడా జీవించలేదు. జన వనరుల అభివృద్ధికి ప్రజలు కట్టుబడి ఉండేలా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ దినోత్సవం 2005 జూన్‌ 21న ప్రారంభమైంది.

టీ షర్ట్‌డే:

అన్ని దినోత్సవాల లాగే జూన్‌ 21న టీ షర్ట్‌ దినోత్సవాన్ని కూడా జరుపుకొంటారు. 2008లో దీనిని ఓ జర్మనీకి చెందిన దుస్తుల సంస్థ మొదలు పెట్టింది. యువత దీనిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కొన్ని దేశాలలో టీ షర్ట్‌ డే ఓ ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే జూన్‌ 21న ఏడు ప్రత్యేక రోజులు ఎందుకని చాలా మందిలో అనుమానం వస్తుంటుంది. ఈ దినోత్సవాల రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.. రాబోయే తరల వారికి వాటిని అందిస్తుండాలని. ఇందులో జన దినోత్సవం.. నీతి సమస్య లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.? అనే అంశంపై చర్చలు జరుగుతుంటాయి. వాటిని ఐక్యరాజ్యసమితి తీర్మానాలు చేసి ప్రపంచానికి అందిస్తుంటాయి. అలాగే యోగాడే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది. యోగా వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండేందుకు ఈ దినోత్సవం రోజున ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. అలాగే క్యాన్సర్‌ డేలాంటివి కూడా ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖలు సూచిస్తుంటాయి. ఇలా ముఖ్యమైన డేలను జరుపుకోవడం వల్ల ప్రజల్లో చైతన్యం రావడం, అవగాహన కల్పించుకోవడం వల్ల జీవన విధానానికి ఎన్నో ఉపయోగాలుంటాయని గుర్తు చేస్తూ ఇలాంటి దినోత్సవాలను జరుపుకొంటారు. అంతేకాదు వీటి వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటూ, సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రత్యేక రోజులు జరుపుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు.

Next Story