నమ్ముకున్నందుకు మమ్మల్ని చంకనాకించావ్
By రాణి Published on 18 Dec 2019 5:24 PM ISTఅనంతపురం : ‘జగన్ ఎలాంటివాడో నేను గతంలోనే చెప్పా, మావాడి సంగతి మీకు తెలియదని చెబుతున్నా, వైఎస్‌తో నాకు సాన్నిహిత్యం ఉన్నప్పటి నుంచే జగన్ గురించి తెలుసు. జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా, వైఎస్‌లో ఉన్న 10శాతం మంచిగుణాలు కూడా జగన్‌లో లేవు. అచ్చం రాజారెడ్డిలాంటివాడు వైఎస్ జగన్’ అని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు వేదికపై ఉండగానే జేసీ జగన్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేశారు.
అలాగే చంద్రబాబులో కూడా మార్పు రావాలన్నారు జేసీ. శాంతి వచనాలు చెప్పి మమ్మల్ని చంకనాకించారని, ఇప్పటికైనా శాంతి వచనాలను పక్కనపెట్టాలని సూచించారు. మీ చుట్టూ చేరి చప్పట్లు కొట్టే వారిని అసలు నమ్మొద్దన్నారు. ‘మీరు ఈ ఐదేళ్లలో రిటైర్ కారు. మేం మళ్లీ వస్తాం, మీ పేరు గుర్తించుకుంటాం’అని జేసీ జోస్యం చెప్పారు.