జయప్రకాశ్‌ నటించిన సినిమాల్లో టాప్‌ 12 సినిమాలు ఇవే..

By సుభాష్  Published on  8 Sep 2020 11:05 AM GMT
జయప్రకాశ్‌ నటించిన సినిమాల్లో టాప్‌ 12 సినిమాలు ఇవే..

విలక్షణ నటుడు జయప్రకాశ్‌రెడ్డి అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా యావత్‌ సినీ ప్రపంచాన్ని విషాదంలో నెట్టింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాటికల నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాశ్‌రెడ్డి. తన 32 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 300లకుపైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. జయప్రకాశ్‌ రెడ్డి 1946 మే 8వ తేదీన జన్మించారు. సొంతూరు క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం శిరివెళ్ళ. 1988 లో విడుదలైన బ్రహ్మపుత్రుడు మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లో ఆయన నటించారు. ఆయన నటించిన సినిమాల్లో టాప్ 12 సినిమాలు ఇవే..

1.బ్రహ్మపుత్రుడు :

ఒక నటుడికి తొలి సినిమా కంటే ప్రత్యేకమైనది మరొకటి ఉండదనే చెప్పాలి. దాసరి నారాయణరావు తెరకెక్కించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

2. సమరసింహారెడ్డి :

బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డిలో జయప్రకాశ్‌ నటన మర్చిపో్లేనిది. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

3. ప్రేమించుకుందాం రా!

నేను చూసింది రైటా..రాంగా.. అంటూ తన పక్కన శ్రీహరిని అడిగే పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సీమ ఫ్యాక్షనిజం తన పాత్రలో చూపించి గుర్తింపు తెచ్చుకున్నారు.

4. జయం మనదేరా :

జయప్రకాశ్‌ రెడ్డి 32 ఏళ్ల కెరీర్‌లో ఒకే ఒక నంది అవార్డు సొంతం చేసుకున్న చిత్రం ఇది. ఈ సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా ఆయన బంగారు నంది అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలో జయప్రకాశ్‌ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

5. జంబలకిడిపంబ :

ఈ సినిమాలో జయప్రకాశ్‌ రెడ్డి అద్బతన పాత్రలో నటించి కడుపుబ్బా నవించారు. ఈ వీధి సత్యనారాయణ తెరకెక్కించిన కామెడీ ఎంటర్ట్రైనర్‌లో చిన్న పిల్లాడిలా ఉండే పాత్రలో నటించారు.

6. ఎవడిగోల వాడిది :

నడుము చుట్టు ఒక టవాల్‌ కట్టుకుని ఎవరో తను చంపుతున్నారు అంటూ భయపడే పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఎప్పుడు చూసినా నవ్వు ఆపుకోలేని పాత్ర జయప్రకాశ్‌రెడ్డిది.

7. ఆనందం :

సినిమాలో ఎంత సేపు పాత్ర ఉంది అనేది ముఖ్యం కాదు. చేసిన పాత్ర ప్రేక్షకుల్లో ఎంత కాలం గుర్తుండి పోతుందనేది ముఖ్యం. ఈ సినిమాలో జయప్రకాశ్‌ పాత్ర మర్చిపోలేనిది.

8.కిక్‌:

ఈ సినిమా కూడా ఆనందం తరహా పాత్రలో నటించారు జయప్రకాశ్‌రెడ్డి. కనిపించేది కొద్దిసేపే అయినా గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వుకునే పాత్రనే.

9. ఢీ:

ఈ సినిమాలో జయప్రకాశ్‌ పాత్రకు ఎంతో పేరొచ్చింది. ఈ సినిమాలో కాళ్లు, చేతులు పని చేయవు. మాటలు రావు. కేవలం కుర్చీకిపరిమితం అయ్యే పాత్ర. ఈ సినిమాలో కూడా జయప్రకాశ్‌ రెడ్డికి ఎంతో పేరొచ్చింది.

10. నాయక్‌:

నేను ఎంత పెడితే అంత తినాలి.. ఏది పెడితే అది తినాలి.. అంటూ బ్రహ్మనందంతో ఆడుకునే పాత్ర అంతా ఇంతా కాదు. జిలేబి ఏందిరా అంటూ ఆయన మాండలికంలో కళ్లలో నీళ్లు వచ్చేంత వరకు నవ్వించారు జయప్రకాశ్‌రెడ్డి. ఈ సినిమాలో కూడా ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

11. రెడీ :

ఏమిరా పులి.. అంటూ రెడీ సినిమాలో జయప్రకాశ్‌ రెడ్డి చేసిన కామెడీ మర్చిపోలేనిది. జయప్రకాశ్‌ ఏ సినిమా చేసినా ఎప్పటికి గుర్తిండే ఉంటుంది.

12.సరిలేరు నీకెవ్వరు:

కూజా లెక్క ఉన్నవ్‌.. కొడితే శంబు అయిపోతావ్‌ అంటూ చివరిసారిగా అందరిని నవ్వించారు జయప్రకాశ్‌. ఆయన చేసింది చివరి సినిమా ఇదే. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.

Next Story