తొలి జేమ్స్‌బాండ్‌ ఇక లేరు

By సుభాష్  Published on  1 Nov 2020 2:55 AM GMT
తొలి జేమ్స్‌బాండ్‌ ఇక లేరు

జేమ్స్‌బాండ్‌ అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సీన్‌ కానరీ (90) శనివారం కన్నుమూశారు. తొలి బాండ్‌ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన.. 1962లో వచ్చిన 'డాక్టర్‌ నో' చిత్రంతో వరుసగా ఏడు బాండ్‌ చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటిష్‌ నటుడైన సీన్‌ కానరీ ఆస్కార్‌తో పాటు రెండు బాఫ్తా, మూడు గోల్డెన్‌ అవార్డులు సైతం దక్కించుకున్నారు.

1930 ఆగస్టు 25న జన్మించారు. 13 ఏళ్లకు స్కూల్‌ మానేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పాలు అమ్మడం, కేఫ్‌ క్లీనింగ్‌ వంటి పనులు చేశారు. ఆ తర్వాత సినిమాల్లో వచ్చిన కానరీ 'ద హంట్‌ ఫర్‌ రెడ్‌ అక్టోబర్‌', ఇండియా జో్న్‌ అండ్‌ ది లాస్ట్‌ క్రూసేడ్‌, మర్డర్‌ ఆన్‌ ది ఓరియంట్‌ ఎక్స్‌ ప్రెస్‌, ది రాక్‌ తదితర చిత్రాల్లో నటించారు.

Next Story