బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని.. అత్యాచారయత్నం

By Newsmeter.Network  Published on  11 Dec 2019 8:08 AM GMT
బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని.. అత్యాచారయత్నం

బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఓ యువకుడు ఇద్దరమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్ప‌డ‌బోయాడు. బైక్‌పై లిప్ట్ ఇచ్చి ఇద్ద‌రు అమ్మాయిల‌ను తీసుకువెళుతూ.. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో బైకును నిలిపి అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. ఈ సంఘ‌ట‌న‌ జగిత్యాల జిల్లా రాయికల్ లో చోటుచేసుకుంది. రామారావు పల్లెకు చెందిన ఇద్దరు బాలికలు రాయికల్ వెళ్ళేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లెకు చెందిన కుంచం వేణు ఆ బాలికలను రాయికల్ లో దింపుతాను అని నమ్మబలికించాడు.

ఈ క్రమంలో ఆ ఇద్దరు బాలికలు.. ఆ యువకుడి తో బైక్ పైన రాయికల్ బయలుదేరారు. ఆ యువకుడు మార్గమద్యంలో బాలికలపైనా అత్యాచార య‌త్నానికి ఒడిగ‌ట్టాడు. వెంట‌నే ఓ అమ్మాయి ప్రతిఘటించి అతనిపై రాళ్ళను విసిరింది. ఈ క్రమంలో యువకుడు.. వేరే యువతి మెడలోని బంగారు చైన్ ను లాక్కొని పారిపోయాడు.

వీరిలో ఒకమ్మాయి డిగ్రీ చదువుతుండగా.. మరొకరు ఎనిమిదవతరగతి చదువుతున్నారు. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా ఆ యువకుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story
Share it