నాగబాబు ఎగ్జిట్ తో వాడిపోయిన జబర్దస్త్

By రాణి  Published on  30 Dec 2019 11:45 AM GMT
నాగబాబు ఎగ్జిట్ తో వాడిపోయిన జబర్దస్త్

జబర్దస్త్..ఎక్స్ ట్రా జబర్దస్త్.. తెలుగు రాష్ర్టాల్లో ఈ రెండు కామెడీ షో లు చూడని వాడు ఉండడు. ఈ షో లకు ఇంతకు ముందు వరకూ స్పెషల్ ఎట్రాక్షన్ నాగబాబు నవ్వులు. నిజానికి జబర్దస్త్ ఎంట్రీతోనే ఆయనకు నవ్వుల నవాబు ..నాగబాబు అని పేరొచ్చింది. ఉన్నట్లుండి ఏమైందో తెలీదు గానీ..నాగబాబు జబర్దస్త్ జడ్జిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి షో లో రోజా పక్కన ఎవరో ఒక స్పెషల్ గెస్ట్ జడ్జిగా కూర్చుంటున్నారు గానీ..ఇంత వరకూ రెండో జడ్జి విషయంలో క్లారిటీ రాలేదు.

జబర్దస్త్ ని రోజా ఏదో ఓ కుర్ర హీరోతో నడిపించేస్తుంటే.. ఎక్స్ట్రా జబర్దస్త్ లో మాత్రం అలీ, పోసాని లాంటి వారు వెళ్లి గెస్ట్ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ నాగబాబు స్థాయిలో మెప్పించలేకపోతున్నారని, వారిద్దరి ఎంట్రీ చాలా చప్పగా ఉందంటున్నారు ప్రేక్షకులు. అదీ కాక నాగబాబు జడ్జిగా వస్తున్న అదిరింది షో ఇప్పటికే రెండు ఎపిసోడ్ లు ప్రసారమయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్ లు చూసిన వారంతా పాత జబర్దస్త్ ను కాపీ కొట్టినట్లే ఉందంటున్నారు. అదిరింది షో కి ఎన్ని మైనస్ లు ఉన్నాయో..నాగబాబు జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయాక అన్నే మైనస్ లు కనబడుతున్నాయట.

ప్రస్తుతం టీమ్ లీడర్లంతా అలాగే ఉన్నప్పటికీ వాళ్లు చేసే స్కిట్లలో పట్టు కనిపించడం లేదు. టీమ్స్ చేస్తున్న స్కిట్లలో కడుపుబ్బా నవ్వుకునేంత కంటెంట్ లేకపోయినా రోజా మాత్రం 10 మార్కుల బోర్డు చూపిస్తూ స్కిట్లు చాలా గొప్పగా ఉన్నాయని చెప్తున్నారు. దీంతో రావాల్సిన ఎమౌంట్ వస్తుంది. మా స్కిట్లు బాగానే ఉన్నాయనుకుంటున్న టీమ్ లీడర్లేమో కొత్త కొత్త పంచ్ లు, స్కిట్లకు పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదు. అలీ, పోసాని వంటి వారిని జడ్జిలుగా పెడితే షో పెద్దగా ఎట్రాక్టింగ్ గా ఉండటం లేదని, కాస్తంత యాక్టివ్ గా ఉండే వారిని జడ్జిగా పెడితే బాగుంటుందని పలువురు సలహాలు కూడా ఇస్తున్నారట. మరి ఈటీవీ యాజమాన్యం, మల్లెమాల ప్రొడక్షన్స్ ఈ విషయం పై దృష్టి పెడతారేమో చూడాలి.

Next Story