హీరోయిన్‌లలో టాప్‌లో ఒకరుగా ఉన్న రష్మిక మందన ఇంటిపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో ఈనెల 21న బెంగళూరులోని ఐటీ కార్యాలయంలో విచారణ నిమిత్తం హాజరు కావల్సిందేనని నటీ రష్మికతో పాటు ఆమె తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశారు ఐటీ అధికారులు.

కాగా, మూడు రోజుల క్రితం కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజపేటలో ఉన్న రష్మిక ఇల్లు, కుటుంబానికి చెందిన కళ్యాణ మండపం, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయం కంటే అధికంగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఆస్తులకు సంబంధించి రూ. 25 లక్షల వరకు విలువ చేసే పలు డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఆస్తులన్ని చట్టబద్దమైనవేనని రష్మిక తండ్రి మధన్‌ చెబుతున్నారు. ఐటీ విచారణకు హాజరవుతామని తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.