మటన్‌ ఎక్కువ ధరకు అమ్ముతున్నారా..? ఈ నెంబర్లకు ఫోన్‌ చేయండి

By Newsmeter.Network  Published on  12 May 2020 5:47 AM GMT
మటన్‌ ఎక్కువ ధరకు అమ్ముతున్నారా..? ఈ నెంబర్లకు ఫోన్‌ చేయండి

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వైెరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాయి. నెలన్నరగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇండ్లకే పరిమితం అయ్యారు. దుకాణాలు అన్నీ బంద్‌ అయ్యాయి. కేవలం నిత్యావసర సరుకులకు సంబంధించిన దుకాణాలను మాత్రమే నిబంధనల మేరకు విక్రయాలు చేసుకొనేందుకు అనుమతిచ్చారు. దీనిలో మటన్‌, చికెన్‌ దుకాణాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ వేళ మటన్‌, చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. వీటిని అదుపు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇష్టారీతిలో ధరలు పెంచి విక్రయాలు సాగించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మటన్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కృత్రిమ కొరత సృష్టిస్తూ పలువురు వ్యాపారులు కిలో మటన్‌ ధరను రూ. వెయ్యి నుంచి రూ. 1200 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేసినా పట్టించుకొనేవారు కరువవటంతో పలువురు వ్యాపారుల ఆగడాలు ఎక్కువయ్యాయి.

Also Read :ఏపీ ఏకపక్ష నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వస్తే మటన్‌ రేటు ఆకాశాన్ని తాకుతుంది. ఈ ధరలను కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌లోని మాంసం దుకాణాల్లో కిలో మటన్‌ రూ. 700కు మించి విక్రయాలు చేస్తే చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. దుకాణాల ముందు కచ్చితంగా ధరల వివరాలతో బోర్డులు పెట్టాలని వెటర్నరీ విభాగం అధికారుల నెంబర్లు రాయాలని చీఫ్‌ వెటర్నరీ అధికారి డాక్టర్‌ అబ్దుల్‌ వకీల్‌ ఆదేశించారు. ఈ మేరకు జోన్‌ల వారీగా అధికారుల నెంబర్లు కేటాయించామని, అధిక ధరలకు విక్రయిస్తే స్థానిక ప్రజలు ఈ నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. జోన్‌ల వారీగా చూస్తే.. ఎల్‌బీనగర్‌ జోన్‌ పరిధిలో సి. సుకునందన్‌రెడ్డి(9989930359), పి. రామకృష్ణారావు (9989930357), ఎం. సబిత (9154032869), ఎం. శివరామకృష్ణ(9154156675), చార్మినార్‌ జోన్‌ పరిధిలో సి. సుకునందన్‌రెడ్డి (9989930359), వై. సద్గుణాదేవి(9177904941), ఎస్‌. అశోక్‌ కుమార్‌ (9989930212), ఆర్‌. రామచంద్రారెడ్డి(9100361357), ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో జేడీ విల్సన్‌ (9704456521), ఎంఏ సాజిద్‌ (9989930356), పి. మోహన్‌రెడ్డి (9154113797), ఎం. జేవ్య(9154113791), శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో డి. రణజిత్‌ (9866699401), కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో ఎల్‌. గోవర్ధన్‌రెడ్డి (9704456520), ఎ. లింగస్వామి(9154115007), సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో ఎల్‌. గోవర్ధన్‌రెడ్డి (970 4456520), టి. శ్రీనివాస్‌రెడ్డి(9989930397), కె. గోపిరెడ్డి (9154156672), ఎ. సరిత (9154156670) నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని వకీల్‌ సూచించారు.

Also Read :కరోనా సోకితే పక్షవాతం వస్తుందా..? ఎంతవరకు అవకాశముంటుంది?

Next Story