భోజనాల రేట్లను పెంచిన IRCTC

By రాణి  Published on  24 Dec 2019 12:35 PM GMT
భోజనాల రేట్లను పెంచిన IRCTC

ఇండియన్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఫుడ్ రేట్లను సవరిస్తూ తాజాగా రూపొందించిన మెనూని విడుదల చేసింది. ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఇవే ధరలు వర్తిస్తాయని IRCTC స్టాక్ ఎక్స్చేంజికి చేసిన ఫైలింగ్ లో వెల్లడించింది. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్ లలో ప్రామాణికమైన ఆహార ధరలను మార్చిందని, ఈ ధరలు జీఎస్టీతో కలిపి మార్చబడ్డాయని irctc పేర్కొంది.

జనాహార్, రిఫ్రెష్ మెంట్ రూమ్స్, ప్రామాణిక భోజనం, జనతా మీల్స్, మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారానికి తాజాగా మార్చిన రేట్లే వర్తిస్తాయి. ఈ ధరల పెంపు ద్వారా ఐఆర్ సీటీసీ, జోనల్ రైల్వేల్లో అందించే ఆహార నాణ్యత, శుభ్రత పెరగాలని వెల్లడించింది. త్వరలోనే ఆహార నాణ్యతపై తనిఖీలు కూడా చేస్తామని తెలిపింది.

జీఎస్టీతో కలిపి పెంచిన ఆహారం ధరలు ఇలా ఉన్నాయి.

వెజిటేరియన్ బ్రేక్ ఫాస్ట్ - రూ.35

నాన్ వెజిటేరియన్ బ్రేక్ ఫాస్ట్ - రూ.45

వెజ్ మీల్స్ - రూ.45

స్టాండర్డ్ మీల్స్ (కోడిగుడ్డు కూరతో) - రూ.80

స్టాండర్డ్ మీల్స్ (కోడిమాంసం కూరతో) - రూ.120

వెజ్ బిర్యానీ (350 గ్రాములు) - రూ.70

ఎగ్ బిర్యానీ - రూ.80

చికెన్ బిర్యానీ - రూ.100

స్నాక్ మీల్ (350 గ్రాములు) - రూ.50

Next Story
Share it