సగానికి తగ్గిన ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ.. ఎందుకంటే..?

By Newsmeter.Network  Published on  4 March 2020 8:53 AM GMT
సగానికి తగ్గిన ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ.. ఎందుకంటే..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ ఫ్రైజ్‌మనీని బీసీసీఐ తగ్గించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అన్ని ఫ్రాంచైజీలకు తెలియజేసింది. 2019లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టుకు రూ.20కోట్లు ఇచ్చారు. కాగా 2020లో ఐపీఎల్‌ టైటిల్‌ విజేతగా నిలిచే జట్టుకు రూ.10కోట్లు మాత్రమే ఇవ్వనున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ప్రైజ్‌ మనీ సగానికి సగం తగ్గడం గమనార్హం.

ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిలో మార్పులు చేశాం. ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు రూ.20కోట్లకు బదులు రూ.10కోట్లు లభిస్తాయి. రన్నరప్‌కు రూ.12.5కోట్లకు బదులుగా రూ.6.25కోట్లు దక్కుతాయి అని బీసీసీఐ వెల్లడించింది. ఇక క్వాలిఫయిర్స్‌కు అర్హత సాధించిన రెండు జట్లకు రూ.4.37కోట్లు అందించనున్నారు. ప్రస్తుతం ఫ్రాంచైజీలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. వారికి ఆదాయాన్ని పెంచుకోవడానికి స్పాన్సర్‌ షిప్స్‌ వంటి మార్గాలు ఎన్నో ఉన్నాయని, అందుకే ప్రైజ్‌మనీపై ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధికారి తెలిపారు. ఎనిమిది గంటల కన్నా తక్కవ ప్రయాణ సమయం పట్టే ఆసియా దేశాలకు బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లేందుకు బీసీసీఐ మిడిల్ లెవల్‌ ఉద్యోగులకు అనుమతి నిరాకరించింది. మార్చి 29 నుంచి ఐపీఎల్‌-2020 సీజన్‌ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబాయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది.

Next Story